Uppena: 'ఉప్పెన' డైరెక్టర్‌కి బెంజ్ కార్ గిఫ్ట్

Uppena: తొలి సినిమా 'ఉప్పెన' తో తెలుగు ఇండస్ట్రీకి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందించాడు డైరెక్టర్ బుచ్చిబాబు.

Venkata Chari
Updated on: 26 March 2021 10:12 AM IST
Uppena Director Buchibabu Sana Gets Benz GLC Car
X

ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు, స్టార్ డైరెక్టర్ సుకుమార్

Uppena: తొలి సినిమా 'ఉప్పెన' తో తెలుగు ఇండస్ట్రీకి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందించాడు డైరెక్టర్ బుచ్చిబాబు. ఈ సినిమాతో టాలీవుడ్‌కు వైష్ణవ్‌ తేజ్‌, కృతీ శెట్టి లు పరిచయం అయ్యారు. ఈ సినిమా వంద కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించడంతో... మైత్రీమూవీ మేకర్స్‌ హీరోహీరోయిన్లకు భారీగానే ఎమౌంట్ ముట్టజెప్పారు. హీరో వైష్ణవ్‌ తేజ్‌కు కోటి రూపాయలు, హీరోయిన్‌ కృతీ శెట్టికి రూ.25 లక్షలు ఇచ్చినట్లు వార్తలు వినిపించాయి.

ఇక, డైరెక్టర్ బుచ్చిబాబుకు కారు లేదా ఇల్లును ఆఫర్‌ చేసింది నిర్మాణ సంస్థ. అయితే బుచ్చిబాబు కారు తీసుకునేందుకే ఆసక్తి చూపించారంట. దీంతో బెంజ్ జీఎల్‌సీ కారును గిఫ్ట్ గా ఇచ్చి సర్ ప్రైజ్ చేశారు డైరెక్టర్‌ని. దీని విలువ సుమారు రూ.75 లక్షలు ఉంటుందని అంచనా. కారు తీసుకున్న వెంటనే తన గురువు సుకుమార్‌ను ఎక్కించుకుని హైదరాబాద్‌ రోడ్ల మీద చక్కర్లు కొట్టాడు డైరెక్టర్ బుచ్చి బాబు. ఇందుకు సంబంధించిన ఫొటోలను బీఏ రాజు షేర్ చేశారు. ఈఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.


Venkata Chari

Venkata Chari

Next Story