Krithi Shetty: మెగా హీరో ఆఫర్‌ను తిరస్కరించిన ఉప్పెన బ్యూటీ?

Krithi Shetty: తొలి సినిమా 'ఉప్పెన'తో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయింది హీరోయిన్‌ కృతి శెట్టి.

Venkata Chari
Published on: 24 May 2021 5:52 PM IST
Uppena Beauty Krithi Shetty Rejects a Mega Hero Sai Dharam Tej Film | Tollywood Latest Update
X

కృతి శెట్టి (ఫొటో ట్విట్టర్)

Krithi Shetty: తొలి సినిమా 'ఉప్పెన'తో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయింది హీరోయిన్‌ కృతి శెట్టి. ఈ సినిమాలో మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా టాలీవుడ్ కి పరిచయం అయ్యాడు. ప్రస్తుతం కృతి శెట్టి చాలా సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయింది.

అలాగే మరెన్నో ఆఫర్లు క్యూ కడుతున్నాయి. తాజా నివేదికల ప్రకారం, మెగా కాంపౌండ్‌ నుంచి మరోసారి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. కానీ, ఈ సారి బేబమ్మ.. మెగా హీరో ప్రతిపాదనను తిరస్కరించిందంట. సాయి ధరం తేజ్ రాబోయే సినిమాలో కృతి శెట్టి ని హీరోయిన్‌గా ఎంచుకున్నారంట. #SDT15 గా పిలిచే ఈ సినిమా ఆఫర్‌ను వద్దనుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ హీరోయిన్ నాని, సుధీర్ బాబుతో నటిస్తుంది. ఈ ప్రాజెక్టులు పూర్తయ్యాకే, తన తరువాత సినిమాలకు ఓకే చేప్పనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

మరోవైపు, #SDT15 నిర్మాతలు ప్రస్తుం హీరోయిన్ వేటలో పడ్డారంట. దర్శకుడు కార్తీక్ ఈ ప్రాజెక్టుకు దర్శకుడిగా పనిచేస్తున్నాడు. బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించనున్నట్లు సమాచరం. స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే రాస్తున్నారు.

Venkata Chari

Venkata Chari

Next Story