Krithi Shetty: కృతి అందానికి కుర్రకారు ఫిదా.. ఆఫర్ల 'ఉప్పెన'!

Uppena heroine krithi setty
x

ఉప్పెన సినిమాలో కృతి శెట్టి 

Highlights

*సింగిల్‌ టీజర్‌తోనే స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు *తీసిన సినిమా రిలీజ్‌ అవ్వకముందే ఫుల్‌ క్రేజ్ *ఉప్పెన మూవీలో హీరోయిన్‌గా నటించిన కృతీశెట్టి

ఇండస్ట్రీలో రాత్రికే రాత్రే స్టార్‌ అవ్వాలంటే అంతా ఈజీ కాదు. థియేటర్లో బొమ్మ పడాలి. ఆ బొమ్మ దద్దరిల్లాలి. ఐనా స్టార్ క్రేజ్‌ వస్తుందన్న నమ్మకం లేదు. సినిమా అవకాశాలు క్యూ కట్టాలి. యాక్టింగ్‌తో ప్రేక్షకులను మెప్పించాలి.. థియేటర్లకు రప్పించాలి. ఇంత పెద్ద తతంగం ఉంటంది. కానీ ఇలాంటిదేది లేకుండా.. ఓ హీరోయిన్‌ సింగల్‌ టీజర్‌తోనే కావాల్సినంత స్టార్‌ డమ్‌ తెచ్చుకుంది. ఇక సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ మామాలుగా లేదు. ఓవర్‌నైట్‌ స్టార్‌ హీరోయిన్‌ అయిపోయిన ఆ లక్కీగల్‌ ఎవరో మీరే చూడండి..

హీరోల విషయం పక్కనపెడితే.. కొత్త హీరోయిన్లను ఆదరించడంలో, అభిమానించడంలో టాలీవుడ్‌ ప్రేక్షకులు ఎప్పుడు ముందుంటారు. కొంచెం అందం, అభినయం ఉంటే నెత్తిన పెట్టుకొని మరీ ఆరాధించారు. అదరిస్తారు. తమన్నా, కాజల్‌, సమంత వీళ్లంతా ఇలా వచ్చి అలా సెటిలైనవాళ్లే..

వెండితెరపై ఇప్పుడు ఓ ముద్దుగుమ్మ ఉప్పెనలా వచ్చి మెప్పిస్తోంది. తీసింది ఒక్క సినిమానే అది కూడా ఇంకా రిలీజ్‌ అవ్వలేదు. కానీ ఆ మూవీ హీరోయిన్‌ కృతీ శెట్టి మాత్రం ఫుల్‌ క్రేజ్్ సంపాదించుకుంది.

థియేటర్లలో ఇంకా బొమ్మ పడలేదు. కానీ ఉప్పెన ట్రైలర్‌తోనే కృతీ శెట్టి కుర్రకారును కట్టిపడేసింది. తన అందం, అభినయంతో ఫ్యాన్స్‌ లిస్ట్‌ను పెంచేసుకుంది. ఇక సోషల్‌ మీడియాలో ఈ బ్యూటీకి లైక్‌ల వర్షం కురుస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి సైతం ఈ ముద్దుగుమ్మ పొగడ్తలతో ముంచెత్తాడు. ఈ అమ్మాయిల డేట్‌లను ముందే బుక్‌ చేసుకోండి అంటూ దర్శక నిర్మాతలకు హింట్‌ ఇచ్చాడు. ఫ్యూచర్‌లో కృతీ ఫుల్‌ బీజీ అవుతుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరు మాటలను నిజం చేస్తూ కృతీ బోలెడు సినీ ఆఫర్లను చేజిక్కించుకుంటోంది.

ఇప్పటికే నాని, సుధీర్‌బాబు సినిమాల్లో కృతీ హీరోయిన్‌గా ఫిక్స్‌ అయ్యింది. నాగశౌర్య చిత్రంలోనూ కృతీ డేట్స్ ఇచ్చేసింది. అఖిల్, సురేందర్ రెడ్డి కాంబినేషన్ వచ్చే సినిమాలోనూ కృతీని సెలెక్ట్‌ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి కృతి సింగల్‌ ట్రైలర్‌తోనే స్టార్‌ హీరోయిన్‌ అయిపోయిందన్నమాట.

Show Full Article
Print Article
Next Story
More Stories