Sharwanand: శర్వానంద్ నెక్స్ట్ సినిమా గురించి ఆసక్తికరమైన అప్డేట్

Update about Sharwanand Next Movie
x

Sharwanand: శర్వానంద్ నెక్స్ట్ సినిమా గురించి ఆసక్తికరమైన అప్డేట్

Highlights

Sharwanand: సైలెంట్ గా నెక్స్ట్ సినిమా షూటింగ్ మొదలు పెట్టేసిన శర్వానంద్

Sharwanand: యువ హీరో శర్వానంద్ నటించిన "ఆడవాళ్లు మీకు జోహార్లు" సినిమా ఈమధ్యనే విడుదల అయ్యింది కానీ పెద్దగా హిట్ అవ్వలేదు. కానీ "ఒకే ఒక జీవితం" సినిమాతో మాత్రం బాగానే హిట్ అందుకున్నాడు శర్వా. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో తల్లి కొడుకుల సెంటిమెంట్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. తాజాగా ఇప్పుడు శర్వానంద్ నెక్స్ట్ సినిమా గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే శర్వానంద్ గత కొద్ది వారాలుగా తన వ్యక్తిగత జీవితం వల్ల బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె రక్షిత రెడ్డితో శర్వానంద్ నిశ్చితార్థం ఈ మధ్యనే అంగరంగ వైభవంగా జరిగింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న రక్షిత మెడలో శర్వానంద్ త్వరలోనే మూడు ముళ్ళు వేయబోతున్నాడు. తాజాగా శర్వానంద్ ఇప్పుడు తన నెక్స్ట్ సినిమా డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో చేయాల్సి ఉంది.

తాజా సమాచారం ప్రకారం శర్వానంద్ ఇప్పుడు ఈ సినిమా పనులను మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఎలాంటి చప్పుడు చేయకుండానే చిత్ర బృందం సినిమా షూటింగ్ ను అప్పుడే మొదలుపెట్టేసిందట. ప్రస్తుతం చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. కృతి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. దేవదాస్, శమంతక మణి, భలే మంచి రోజు వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన శ్రీరామ ఆదిత్య శర్వానంద్ కోసం ఎలాంటి కథనం రాసుకున్నారు ఇంకా తెలియాల్సి ఉంది. సినిమా గురించిన మరిన్ని వివరాలు కూడా త్వరలోనే విడుదల కాబోతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories