RC15 Movie - Upasana: రామ్ చరణ్ - శంకర్ సినిమా కోసం ముందుకు వచ్చిన ఉపాసన

Upasana Takes Responsibility of Ram Charan Movie RC 15
x

రామ్ చరణ్ - ఉపాసన (ఫోటో- ది హన్స్ ఇండియా )

Highlights

* ఉపాసన ఈ సినిమాకి సంబంధించిన కొన్ని బాధ్యతలు తీసుకోవడానికి ముందడుగు వేసింది

RC15 Movie- Upasana: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా ఇప్పుడు "ఆర్ ఆర్ ఆర్" సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఈ సినిమాకి రామ్ చరణ్ భార్య ఉపాసన కామినేని కి మధ్య ఒక లింక్ ఉందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దిల్ రాజు ఈ భారీ బడ్జెట్ సినిమాని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

తాజా సమాచారం ప్రకారం ఉపాసన కూడా ఈ సినిమాకి సంబంధించిన కొన్ని బాధ్యతలు తీసుకోవడానికి ముందు అడుగు వేసిందట. ఈ సినిమాకి సంబంధించిన పనులన్నీ సక్రమంగా జరుగుతున్నాయో లేదో తెలుసుకునేందుకు ఉపాసన కూడా ఈ సినిమా విషయంలో జాగ్రత్తలు పాటిస్తోందట. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా కనిపించనుంది. ఇక ఈ సినిమాకు సంబంధించి ఫోటోషూట్ కోసం మాత్రమే దిల్ రాజు ఇప్పటిదాకా కోటి రూపాయలను ఉపయోగించినట్లు సినిమా బడ్జెట్ కూడా భారీ రేంజ్ లోనే ఖర్చు అవుతుందని సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories