నా భర్తే నా థెరపిస్ట్.. ఆ డిప్రెషన్ నుంచి బయటపడేశాడు: చరణ్ పై ఉపాసన ఆసక్తికర వ్యాఖ్యలు..

Upasana Says How Ram Charan Helped Her Postpartum Depression
x

నా భర్తే నా థెరపిస్ట్.. ఆ డిప్రెషన్ నుంచి బయటపడేశాడు: చరణ్ పై ఉపాసన ఆసక్తికర వ్యాఖ్యలు..

Highlights

Upasana: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ , ఉపాసన దంపతుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Upasana: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ , ఉపాసన దంపతుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరు చాలా అన్యోన్యంగా ఉంటారు. ఇక చరణ్ పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న సరే, కొంత టైమ్ తన ఫ్యామిలీ కోసం కేటాయిస్తాడు. ఉపాసనతో చాలా ఫ్రెండ్లీగా ఉంటూ..వెకేషన్స్‌కు వెళ్తుంటాడు. అయితే పెళ్లైన 10 సంవత్సరాలకు వీరికి పాప పుట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ప్రసవానంతర డిప్రెషన్‌ను అధిగమించడానికి చరణ్‌ ఎంతో సాయం చేసినట్లు చెప్పారు. డెలివరీ తర్వాత తాను ఎదుర్కొన్న సవాళ్లను తెలిపారు.

అందులో భాగంగా చరణ్ గురించి మాట్లాడుతూ.. నా భర్తే నా థెరపిస్ట్. చాలా మందిలాగే నేను కూడా డెలవరీ తర్వాత తీవ్ర ఒత్తిడికి లోను అయ్యాను. అప్పుడు నాకు అండగా ఉండటానికి చరణ్ నాకు తోడుగా మా పుట్టింటికి వచ్చేశాడు. ఇలాంటి భర్త అసలు ఎవరికీ ఉండరు. ఇది నా అదృష్టం. భార్య తల్లిగా మారే సమయంలో భర్త్ సపోర్ట్ చాలా అవసరం.. ఆయన నాపై తీసుకున్న శ్రద్ధ. నా గురించి ఆలోచించే విధానం నాకు చాలా ఇష్టంగా అనిపిస్తుంది. చరణ్ నా భర్త కావడం నిజంగా నా అదృష్టం అంటూ చెప్పుకొచ్చింది. క్లీంకార ఎన్నో విషయాల్లో తన తండ్రిని తలపిస్తుంది. తన ఆహారపు అలవాట్లు కూడా చరణ్‌లాగే ఉంటాయి’’ అని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories