logo
సినిమా

పెళ్లై పదేళ్లు అయింది.. పిల్లల్ని కనే సామర్థ్యం.. సద్గురుతో ఉపాసన ప్రశ్న.. ఆయన సమాధానమేంటంటే?

Upasana Kamineni Asks Sadhguru About Children
X

పెళ్లై పదేళ్లు అయింది.. పిల్లల్ని కనే సామర్థ్యం.. సద్గురుతో ఉపాసన ప్రశ్న.. ఆయన సమాధానమేంటంటే?

Highlights

Upasana: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య, మెగా కుటుంబానికి కోడలిగా మాత్రమే కాకుండా ఒక ఎంటర్ప్రెన్యూర్ గా కూడా ఉపాసన తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు.

Upasana: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య, మెగా కుటుంబానికి కోడలిగా మాత్రమే కాకుండా ఒక ఎంటర్ప్రెన్యూర్ గా కూడా ఉపాసన తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. అపోలో లైఫ్ కు వైస్ చైర్ పర్సన్ గా ఎన్నో ఏళ్లగా సేవలు అందిస్తూ వస్తున్న ఉపాసన 2012 లో రామ్ చరణ్ ను ప్రేమించి వివాహం చేసుకున్నారు. తాజాగా సద్గురుతో మాట్లాడుతూ తన మనసులోని మాటను బయటపెట్టారు ఉపాసన.

"నా వివాహం జరిగి పదేళ్లు అవుతోంది. వైవాహిక జీవితంలో చాలా సంతోషంగా ఉన్నాను. నా కుటుంబాన్ని నా జీవితాన్ని నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను. కానీ కొందరు నా జీవితంలో ఆర్ ఆర్ ఆర్ గురించి అడుగుతున్నారు. మొదటి ఆర్ నా రిలేషన్ షిప్, రెండవ ఆర్ రీ ప్రొడ్యూస్ (పిల్లలను కనే సామర్ధ్యం), మూడవ ఆర్ జీవితంలో నా రోల్" అని అన్నారు ఉపాసన.

దీనికి సద్గురు కూడా తనదైన శైలిలో జవాబు ఇచ్చారు. "మొదటిది మీ వ్యక్తిగత విషయం. అందులో ఎవరూ తలదూర్చకూడదు. రెండవది పిల్లలను కనగలిగి కూడా కనకుండా ఉండే వారికి నేను అవార్డును ఇస్తానని ఇంతకు ముందే చెప్పాను. ఈ తరం వారికి కచ్చితంగా పిల్లల్ని కనాల్సిన అవసరం ఏమీ లేదు. ఇప్పటికే ప్రపంచంలో చాలామంది జనాభా ఉంది. మనమేమీ ఇప్పట్లో అంతరించిపోవడం లేదు" అని జవాబిచ్చారు సద్గురు. సద్గురు చెప్పిన సమాధానం విన్న ఉపాసన "మీ జవాబు వింటే మీకు మా అమ్మ, అత్తయ్య నుంచి ఫోన్ వస్తుంది," అని నవ్వుతూ అన్నారు.

Web TitleUpasana Kamineni Asks Sadhguru About Children
Next Story