పిల్లల్ని ఎప్పుడు కంటారు? ఈ ప్రశ్నకు నేను సమాధానం..

Upasana: మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌.. ఉపాసనల పెళ్లై ఎనిమిదేళ్లయింది.

Arun Chilukuri
Published on: 12 Nov 2021 2:45 PM IST
పిల్లల్ని ఎప్పుడు కంటారు? ఈ ప్రశ్నకు నేను సమాధానం..
X

పిల్లల్ని ఎప్పుడు కంటారు? ఈ ప్రశ్నకు నేను సమాధానం..

Upasana: మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌.. ఉపాసనల పెళ్లై ఎనిమిదేళ్లయింది. కానీ ఈ జంట ఇంకా ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. పిల్లల్ని కనడంపై ఉపాసనకు అప్పుడప్పుడూ మీడియా నుంచి ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కూడా ఉపాసనకు ఈ ప్రశ్న ఎదురైంది. పిల్లల్ని కనడంపై ఉపాసన ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

దీని గురించి చాలామంది అడుగుతూనే ఉన్నారు కానీ దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని ఉపాసన అభిప్రాయపడింది. దీని గురించి ఏం ఆన్సర్‌ ఇచ్చినా అది సెన్సేషనే అవుతుందని, అది తనకిష్టం లేదని పేర్కొంది. ఎవరేమనుకున్నా ఈ ప్రశ్నకు నేను సమాధానం చెప్పాలనుకున్నప్పుడే చెప్తాను అని తేల్చి చెప్పింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story