Upasana: ఇన్నేళ్లు పిల్లలు వద్దనుకుంది అందుకే.. లేట్‌ ప్రెగ్నెన్సీపై స్పందించిన ఉపాసన..

Upasana Breaks Silence on Late Pregnancy
x

Upasana: ఇన్నేళ్లు పిల్లలు వద్దనుకుంది అందుకే.. లేట్‌ ప్రెగ్నెన్సీపై స్పందించిన ఉపాసన..

Highlights

Ram Charan- Upasana: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన మరికొన్ని నెలల్లో తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే.

Ram Charan- Upasana: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన మరికొన్ని నెలల్లో తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే. దీంతో మెగా ఇంట సంబరాలు మొదలయ్యాయి. అయితే తాము పిల్లల్ని కనే విషయంలో ఎందుకు ఆలస్యం చేయాల్సి వచ్చింది? అందుకు ప్రధాన కారణాలేంటి? అనే విషయాలు బయటపెట్టారు ఉపాసన. ''సమాజం కోరుకున్నప్పుడు కాకుండా నేను తల్లిని కావాలనుకున్నప్పుడు గర్భం దాల్చడం ఎంతో ఉత్సాహంగా, గర్వంగా ఉంది. వివాహమైన పదేళ్ల తర్వాత మేం బిడ్డలను కనాలని అనుకున్నాం. ఎందుకంటే ఇది సరైన సమయం. మేమిద్దరం మా రంగాల్లో ఎదిగాం. ఆర్థికంగా బలోపేతమయ్యాం. మా పిల్లలకు కావాల్సినవన్నీ ఇచ్చే స్థాయికి చేరాం'' అని ఉపాసన చెప్పారు.

ప్రెగ్నెన్సీ ఆలస్యంపై స్పందిస్తూ.. అది తమ ఇద్దరి నిర్ణయమని అన్నారు. ఈ విషయంలో అటు సమాజం, ఇటు కుటుంబం, బంధువుల ఒత్తిడికి తలొగ్గలేదని చెప్పారు. ఇది తమ మధ్య ఉన్న బలమైన బంధాన్ని చెప్పడంతో పాటు, పిల్లల విషయంలో తమకున్న స్పష్టతకు నిదర్శనమని ఉపాసన తెలిపారు. రామ్‌చరణ్‌-ఉపాసన తల్లిదండ్రులు కాబోతున్నట్లు గతేడాది డిసెంబరు 12న ఇరు కుటుంబాలు వెల్లడించాయి. తన డెలివరీ కూడా ఇండియాలోనే జరుగుతుందని ఉపాసన ఇప్పటికే స్పష్టతనిచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories