అన్ లాక్ 5.0 లో ధియేటర్లకి అనుమతి ఇస్తారా? ఇస్తే ఎలా?

అన్ లాక్ 5.0 లో ధియేటర్లకి అనుమతి ఇస్తారా? ఇస్తే ఎలా?
x

 cinema halls

Highlights

Unlock 5.0 Relaxations : కరోనాని అరికట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో అన్ని ఎక్కడికక్కడే స్థంభించిపోయాయి.. అందులో సినీ పరిశ్రమ కూడా ఒకటి.. షూటింగ్ లు ఆగిపోవడం, ధియేటర్లు కూడా మూతపడడంతో ఇండస్ట్రీ అయితే కొన్ని కోట్ల నష్టం చూసింది..

Unlock 5.0 Relaxations : కరోనాని అరికట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో అన్ని ఎక్కడికక్కడే స్థంభించిపోయాయి.. అందులో సినీ పరిశ్రమ కూడా ఒకటి.. షూటింగ్ లు ఆగిపోవడం, ధియేటర్లు కూడా మూతపడడంతో ఇండస్ట్రీ అయితే కొన్ని కోట్ల నష్టం చూసింది.. తాజాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని మార్గదర్శకాలను జారీ చేస్తూ.. షూటింగ్ లకు అనుమతి ఇచ్చాయి కానీ ఇంకా ధియేటర్ల రీ ఓపెన్ పైన ఎలాంటి స్పష్టత లేదు.. అయితే ఈ నెల 30వ తేదిన అన్ లాక్ 4.0 కూడా ముగుస్తుంది.

అక్టోబర్ ఒకటి నుంచి ప్రారభం కానున్న అన్ లాక్ 5.0కి సంబంధించిన మార్గదర్శకాలను కేంద్రం ఇవ్వాలా లేదా రేపు విడుదల చేసే అవకాశం ఉంది.. అయితే ఇందులో సినిమాహాళ్లను తెరవడానికి కేంద్రం అనుమతి ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది. 50% సిట్టింగ్ సామర్ధ్యంతో ఒక లైన్ తర్వాత మరో లైన్ పూర్తిగా ఖాళీగా ఉంచడం, లేదా సీటుకి సీటుకి మధ్య ఖాళీ వదలడం లాంటి కండిషన్లు పెట్టె అవకాశం ఉంది. దాదాపుగా ఆరు నెలల నుంచి దేశంలో ధియేటర్లు మూత పడిన సంగతి తెలిసిందే.. ఇక అటు స్కూల్స్, కాలీజీలకి ఇప్పట్లో అవకాశం ఇచ్చేలా కనిపించడం లేదు..

అటు పచ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇప్పటికే ధియేటర్లకి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ట్వీట్ చేశారు. సీఎం తాజా నిర్ణయంతో ఆ రాష్ట్రములో అక్టోబర్ 01 నుంచి సినిమా ధియేటర్లు ఓపెన్ కానున్నాయి. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా థియేటర్లకైనా కేవలం 50 మందిని మాత్రమే అనుమతిస్తున్నామని, భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం లాంటి కోవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని నిబంధనలో వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories