Unlock 3: తెలుగురాష్ట్రాల్లో సినిమా హాళ్ళు ప్రారంభం అయ్యే చాన్స్ ఎంత?

Unlock 3: తెలుగురాష్ట్రాల్లో సినిమా హాళ్ళు ప్రారంభం అయ్యే చాన్స్ ఎంత?
x
Highlights

Unlock 3: కరోనా అన్ లాక్ డౌన్ - 3 తెలుగు ప్రేక్షకులకు వెండితెరపై సినిమాని చూపించనుంది. ఆగష్టు 1 నుంచీ సినిమా థియేటర్లు ప్రారంభించాలని...

Unlock 3: కరోనా అన్ లాక్ డౌన్ - 3 తెలుగు ప్రేక్షకులకు వెండితెరపై సినిమాని చూపించనుంది. ఆగష్టు 1 నుంచీ సినిమా థియేటర్లు ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అన్ లాక్ డౌన్ - ౩ ఇచ్చే వరంపై థియేటర్ల యజమానులు మాత్రం లాభాల మాట అటుంచితే, నిర్వహణ మాత్రం ఫిఫ్టీ-ఫిఫ్టీ అంటున్నారు.

ఆగ‌స్టు 1 నుంచి థియేట‌ర్లు తెర‌చుకునే అవ‌కాశం ఉంద‌న్న వార్త‌లు వ‌స్తుండ‌డంతో చిత్ర‌సీమ‌లో ఆశ‌లు రేగుతున్నాయి. కరోనా లాక్ డౌన్‌తో థియేటర్లు మూతపడినా ఖర్చులు మాత్రం ఆగలేదంటున్నారు యజమానులు. వర్కర్లు, కరెంటు ఇలా రెగ్యులర్ ఖర్చులుంటే, ఇప్పుడు శానిటేషన్ అతిపెద్ద ఖర్చు అంటున్నారు. మరోవైపు ఓటీఆర్ ద్వారా సినిమాలు రిలీజ్ అయినా, థియేటర్ లో చూసిన అనుభూతి రాదని కొందరు అభిప్రాయ పడుతున్నారు. ‎ఆగస్టు నుంచి థియేటర్లు ప్రారంభించినా నిర్వహణ మాత్రం తలకు మించిన భారం అంటున్నారు.

మరోవైపు కరోనా కరోనా విజృంభిస్తున్న వేళ థియేటర్లు ప్రారంభించకపోవడమే మంచిదని కొందరు అభిప్రాయ పడుతున్నారు. ప్రేక్షకులు కూడా కరోనా భయంతో థియేటర్ కు వస్తారా? అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ వచ్చిన ఒక షో వేయడానికి దాదాపు 15వేలపై ఖర్చు అవుతుందంటున్నారు. కరోనా కారణంగా ప్రజలకు ఆదాయం కూడా పెద్దగా లేదు. థియేటర్లు ప్రారంభమైతే ఎంత మంది వస్తారో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories