బాలకృష్ణ బోయపాటి ప్రాజెక్ట్ ని ఎందుకు పక్కన పెట్టాడు

బాలకృష్ణ బోయపాటి ప్రాజెక్ట్ ని ఎందుకు పక్కన పెట్టాడు
x
Highlights

బాలకృష్ణ నందమూరి ని స్క్రీన్ మీద బోయపాటి తప్ప ఇంకెవరూ ఆ రేంజ్ లో పవర్ఫుల్ గా చూపించలేరు అని ఫాన్స్ నమ్మకం. సింహా, లెజెండ్ సినిమాల తో ఈ కాంబినేషన్ చాలా...

బాలకృష్ణ నందమూరి ని స్క్రీన్ మీద బోయపాటి తప్ప ఇంకెవరూ ఆ రేంజ్ లో పవర్ఫుల్ గా చూపించలేరు అని ఫాన్స్ నమ్మకం. సింహా, లెజెండ్ సినిమాల తో ఈ కాంబినేషన్ చాలా రికార్డ్స్ ని క్రియేట్ చేసింది. అయితే ఈ కాంబినేషన్ మరలా జత కడుతుంది అని బాలకృష్ణ స్వయం గా ప్రకటించాడు కానీ ఇప్పుడు బాలకృష్ణే ఈ సినిమా ని పక్కన పెట్టేసాడు. అనుకోని విధంగా నిన్న బాలకృష్ణ కేఎస్ రవికుమార్ దర్శకత్వం లో ఒక సినిమా చేయనున్నాడు అనే వార్తలు బయటకి వచ్చాయి.

జై సింహా తర్వాత ఈ హీరో దర్శకుడు మరలా జత కడుతుండడం విశేషం. అయితే సడన్ గా బాలకృష్ణ బోయపాటి సినిమా ని పక్కన పెట్టడానికి ఒక కారణం ఉంది. ముందుగా బోయపాటి తో పొలిటికల్ థ్రిల్లర్ తీద్దామ్ అనుకున్నాడు బాలయ్య. ఎన్నికలు ముగిసాయి, ఇప్పుడు ఆ సినిమా చేయడం వలన ఉపయోగం లేదు అని ఇంకో కథ చేసుకొని రమ్మన్నాడు. బోయపాటి కొత్త స్క్రిప్ట్ తో తిరిగి వచ్చాడు కానీ ఈ సినిమా కోసం బాలకృష్ణ బరువు తగ్గాలి. అది జరగాలి అంటే మినిమమ్ మూడు నెలలు పడుతుంది. అందుకే ఈ లోపు రవికుమార్ తో సినిమా ని పట్టాలెక్కించాడు బాలయ్య. రవికుమార్ కూడా సినిమా ని త్వరగానే పూర్తి చేస్తాను అని మాట ఇచ్చారట. ఇది అయిన వెంటనే బోయపాటి తో సినిమా సెట్స్ మీద వెళ్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories