సెలబ్రెటీలను తీసుకెళ్లి మేకల్లా, గొర్రెల్లా ఉంచారు.. యాంకర్ రవి తల్లి సంచలన వ్యాఖ్యలు

Sandeep Reddy
Published on: 11 Dec 2021 3:07 PM IST
Uma Rani Sensational Comments on Bigg Boss Telugu 5 Show About her Son Anchor Ravi Elimination
X

Bigg Boss Telugu 5 Show: యాంకర్ రవి తల్లి సంచలన వ్యాఖ్యలు

Bigg Boss 5 Telugu - Anchor Ravi Elimination News: బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 లో ఇటీవల హౌస్ నుండి యాంకర్ రవి ఎలిమినేషన్ బుల్లితెర ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది. టాప్ 5 లో ఉంటాడనుకున్న రవి ఎలిమినేట్ అవడంతో అతడి అభిమానులు అన్నపూర్ణ స్టూడియోస్ ముందు ఆందోళన చేయడంతో పాటు సోషల్ మీడియాలో బిగ్ బాస్ షోపై ట్రోల్స్ చేసిన సంగతి తెలిసిందే.. తాజాగా యాంకర్ రవి తల్లి ఉమారాణి బిగ్ బాస్ షోపై చేసిన సంచలన వ్యాఖ్యలు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బిగ్ బాస్ షో గురించి ఉమారాణి మాట్లాడుతూ "నా కొడుకు టాప్‌ 5 లో ఉండాల్సిన వాడు ఇలా ఎలిమినేట్‌ అవడం ఆశ్చర్యంగా ఉంది. అతడు గేమ్‌ ఆడాడు. పిచ్చి చేష్టలు చేసి రాలేదు. ఊరికే కూర్చోని తినలేదు. తెలివిగా ఆడాడు. బిగ్ బాస్ షోకి మంచివాళ్లు, ఆట ఆడేవాళ్లు అవసరం లేదని అర్థమైందని.., రవిని కావాలని పిలిచి తీసుకెళ్లారు కానీ ఆ హోదా ఇవ్వలేదని" రవి తల్లి ఉమారాణి చెప్పుకొచ్చింది.

బిగ్‌బాస్‌ హౌజ్‌లో వారంతా సెలబ్రెటీలని "సెలబ్రెటీలను తీసుకెళ్లి మేకల్లా, గొర్రెల్లా ఉంచారు. అదే సినిమా ఇండస్ట్రీలో ఉంటూ ఇండస్ట్రీ వారినే అవమానిస్తున్నారని.., రవి మాత్రమే కాదు ప్రతి కంటెస్టెంట్‌ కు ఇది కరెక్ట్ కాదని ఇప్పటికైన కాన్సెప్ట్‌ మార్చండి. లేకపోతే బిగ్‌బాస్‌ ఎవరూ చూడరు" అంటూ బిగ్ బాస్ పై ఫైర్ అయింది.


Sandeep Reddy

Sandeep Reddy

Next Story