Udhayanidhi Stalin: ఇక పై సినిమాలు చేయ‌ను.. అదే నా ఆఖ‌రి సినిమా..

Udhayanidhi Stalin: తమిళనాడు ముఖ్యమంత్రి తనయుడు, నటుడు, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Arun Chilukuri
Updated on: 15 May 2022 9:00 PM IST
Udhayanidhi Stalin Announces Maamannan Will be his Last Film
X

Udhayanidhi Stalin: ఇక పై సినిమాలు చేయ‌ను.. అదే నా ఆఖ‌రి సినిమా..

Udhayanidhi Stalin: తమిళనాడు ముఖ్యమంత్రి తనయుడు, నటుడు, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై సినిమాల్లో నటించనని రాజకీయాలకు పూర్తి సమయం కేటాయిస్తానని ప్రకటించారు. తాజాగా ఉదయనిధి హీరోగా నటించిన నెంజుకు నిధి చిత్రం ఈనెల 20న విడుదల కానున్నది. ఈ సందర్భంగా తన భవిష్యత్తుపై ఉదయనిధి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి తాను సినిమాల్లో నటించని స్పష్టం చేశారు. తన తదుపరి చిత్రం మామన్ననే చివరిదన్నారు. సినిమాల్లో నటిస్తున్న కారణంగా ప్రజాసేవపై పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోతున్నానన్నారు. ప్రస్తుతం రాజకీయాలపైనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్టు వెల్లడించారు.

ఓకే ఓకే చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదనిధి స్టాలిన్‌ మొదటి సినిమాతోనే ఆకట్టుకున్నారు. ఆ తరువాత పలు చిత్రాల్లో నటించారు. గతేడాది జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే తరఫున చెపాక్‌ తిరువెల్లికేని నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. అంతకుముందు ఉదయనిధి డీఎంకే యూత్‌ వింగ్‌ సెక్రటరీగా పని చేశారు. పార్టీ విజయం కోసం తమిళనాడు వ్యాప్తంగా ప్రచారం చేశారు. తన తండ్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్‌తో కలిసి ప్రజలకు మరింత సేవ చేయాలనుకుంటున్నట్టు తాజాగా ఉదయనిధి ప్రకటించారు. తాజాగా విడుదల కానున్న నెంజుకు నిధి సినిమా బాలీవుడ్‌లో హిట్‌ అయిన ఆర్టికల్‌ 15 సినిమాకు ఇధి రీమేక్ నెంజుకు నిధి చిత్రం తరువాత మామన్నన్‌లో నటించనున్నారు. తాజా ప్రకటనతో ఇదే ఉదయ నిధి చివరి చిత్రం కానున్నది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story