Uday kiran last movie on online: ఓటీటీలో ఉద‌య్ కిర‌ణ్ చివ‌రి చిత్రం... ఫ్యాన్స్ వెయిటింగ్!

Uday kiran last movie on online: ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సొంత టాలెంట్ తో పైకొచ్చిన హీరోలలో ఉదయ్ కిరణ్ ఒకడు.. 2001లో తేజ దర్శకత్వంలో వచ్చిన చిత్రం సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యాడు ఉదయ్ కిరణ్.

Krishna
Updated on: 27 Jun 2020 3:30 PM IST
Uday kiran last movie on online: ఓటీటీలో ఉద‌య్ కిర‌ణ్ చివ‌రి చిత్రం... ఫ్యాన్స్ వెయిటింగ్!
X

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సొంత టాలెంట్ తో పైకొచ్చిన హీరోలలో ఉదయ్ కిరణ్ ఒకడు.. 2001లో తేజ దర్శకత్వంలో వచ్చిన చిత్రం సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యాడు ఉదయ్ కిరణ్(Uday kiran last movie on online). ఈ సినిమా బాగా హిట్ కావడంతో ఉదయ్ కిరణ్ కి మంచి క్రేజ్ ఏర్పడింది.. ఆ తర్వాత వచ్చిన నువ్వే నువ్వే , మనసంతా నువ్వే సినిమాలు మళ్లీ భారీ హిట్ కావడంతో ఉదయ్ కిరణ్ ఇమేజ్ ఆకాశమంతా ఎత్తుకు చేరుకుంది.. అయితే వ్యక్తిగత విషయాలు, చేసిన సినిమాలు కూడా ప్లాప్ అవ్వడం, కొత్త ఆఫర్స్ రాకపోవడంతో ఉదయ్ కిరణ్ డిప్రెషన్ లోకి వెళ్లి పోయి ఆత్మహత్య చేసుకున్నాడు.. ఉదయ్ కిరణ్ ఆత్మహత్య అందరిని కలిచివేసింది.

అయితే ఉదయ్ కిరణ్ చివరగా నటించిన చిత్రం చెప్పిన కథ అనే సినిమాని అప్పట్లో విడుదల చేయాలని దర్శక నిర్మాతలు బాగానే ప్లాన్ చేశారు కానీ అది కుదరలేదు.. ప్రస్తుతం ఆ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది..తమ అభిమాన నటుడు చివరి సినిమా రిలీజ్ అవుతుంది అనే సరికి అభిమానులలో విపరీతమైన ఆసక్తి పెరిగింది. ఇక ఉదయ్ కిరణ్ మొదటి సినిమా పేరు చిత్రం కావడం ... అతని చివరి సినిమా పేరు కూడా చిత్రం చెప్పిన కథ కావడం విశేషం.. ఇక ఉదయ్ కిరణ్ జయంతి నిన్న అన్న సంగతి అందరికీ తెలిసిందే..

ఇక ఇది ఇలా ఉంటే బాలీవుడ్ సంచలనం సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.. అతడు చివరిసారిగా నటించిన 'దిల్ బేచారా' (Dil Bechara) అనే సినిమాని త్వరలో అభిమానుల ముందుకు తీసుకొచ్చేందుకు దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు..వచ్చే నెల 24న ఈ సినిమాని డిస్నీ ప్లస్ హాట్ స్టార్(Disney Plus Hotstar) లో విడుదల చేయనున్నారు.. ఈ సినిమాను ఫ్రీగా చూసే అవకాశం కల్పిస్తున్నారు.

Krishna

Krishna

Next Story