Samantha: సమంతా నో చెప్పిన సినిమాలన్ని సూపర్ హిట్‌లేనా!

U-turn Hindi Remake: Samantha Rejects Bollywood Movie?
x

సమంతా (ఫొటో హన్స్ ఇండియా)

Highlights

Samantha: సమంతా అక్కినేని తన సినిమా ప్రయాణంతో గత పదేళ్లుగా అభిమానులను అలరిస్తోంది. ఇప్పటి కూడా ఎక్కువ మంది కోరుకునే నటి.

Samantha: సమంతా అక్కినేని తన సినిమా ప్రయాణంతో గత పదేళ్లుగా అభిమానులను అలరిస్తోంది. ఇప్పటి కూడా ఎక్కువ మంది కోరుకునే నటి. అలాగే టాలీవుడ్లో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణుల్లో ఒకరు. సమంతా పెళ్లి తర్వాత కూడా చిత్ర పరిశ్రమలో చురుకుగా ఉంది. సమంతా గతంలో కొన్ని సినిమాలను తిరస్కరించిన సందర్భాలు ఉన్నాయి. అయితే, ఆమె తిరస్కరించిన కథలు సూపర్ హిట్స్ గా నిలవడం గమనార్హం.

ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు మణిరత్నం డైరెక్టన్ చేసిన "కాదల్" చిత్రాన్ని సమంతా తిరస్కరించారు. గౌతమ్ కార్తీక్, అరవింద్ స్వామి, అర్జున్ నటించిన ఈ చిత్రం సూపర్ హిట్ మూవీగా నిలిచింది. ఈ సినిమా కథ మత్స్యకారుల జీవితాలతో ముడిపడింది. ఈ సినిమాకి మంచి స్పందన వచ్చింది.

అలాగే, రామ్ చరణ్, అల్లు అర్జున్ నటించిన ఎవరు సినిమాలోనూ సమంతా అక్కినేనితో నటించాల్సి ఉంది. కానీ, డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఆ ప్రాజెక్ట్‌లో నటించలేదు. ఇది కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో శ్రుతి హాసన్, అమీ జాక్సన్, కాజల్ అగర్వాల్ నటించారు. మరో బ్లాక్ బస్టర్ మూవీ "ఐ" ను కూడా సమంతా అక్కినేని తిరస్కరించారు.

నాచురల్ స్టార్ నాని నటించిన మరో విజయవంతమైన తెలుగు చిత్రం "నిన్ను కోరి". ఈ సినిమాను సమంత వదులుకుంది. ఈ పాత్రను నివేదా థామస్ పోషించారు. ఈ చిత్రం లవ్‌స్టోరీ. ఇది టాలీవుడ్‌లో భారీ విజయాన్ని సాధించింది. ఇవే కాక సమంతా మరికొన్ని సినిమాలను కూడా తిరస్కరించిది. "యూ-టర్న్" అనే కన్నడంలో హిట్ అయిన సినిమాకు తెలుగు వెర్షన్ లో సమంతా కనిపించింది. అయితే, హీందీ లో కూడ నటించాలని వచ్చి ప్రతిపాదనలను తిరస్కరించింది.

సమంతా అక్కినేని తమిళం, తెలుగు, హిందీ భాషల్లో పదేళ్ల వ్యవధిలో పలు సినిమాల్లో నటించారు. రకరకాల పాత్రలను పోషించింది. అయితే ప్రస్తుతం చేస్తున్న సినిమాలో నా డ్రీమ్ రోల్ పాత్రలో నటించబోతున్నాను అని వెల్లడించింది సమంతా. అలాగే, " శాకుంతలం సినిమాను దిల్ రాజు సర్, గుణ శేఖర్ నాకు మంచి బహుమతి అందించారు. ఇలాంటి పాత్రను పోషించాలని నేను ఎప్పటినుంచో కలలు కంటున్నాను. నేడు నా కల నెరవేరింది. ఈ పాత్రకు న్యాయం చేయడానికి నా శాయశక్తుల ప్రయత్నం చేస్తాను. గత నాలుగు నెలలుగా ఈ సినిమా ఈ పాత్ర కోసం సిద్ధమవుతున్నాను." అని సమంత పేర్కొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories