పవన్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. ఒకేసారి రెండు ఓటీటీల్లో భీమ్లా నాయక్‌..

Two OTT Platforms to Stream Bheemla Nayak From March 25
x

పవన్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. ఒకేసారి రెండు ఓటీటీల్లో భీమ్లా నాయక్‌..

Highlights

Bheemla Nayak: "వకీల్ సాబ్" సినిమాతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా "భీమ్లా నాయక్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

Bheemla Nayak: "వకీల్ సాబ్" సినిమాతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా "భీమ్లా నాయక్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన "అయ్యప్పనుమ్ కోషియుమ్" సినిమాకి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కింది. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించగా రానా కూడా ఒక పవర్ ఫుల్ పాత్రలో కనిపించారు. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా కి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే మరియు డైలాగులను అందించారు. నిత్య మీనన్ మరియు సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 25న థియేటర్లలో విడుదలైంది.

కాగా ఈ సినిమా అభిమానులకు చిత్ర బృందం మరో గుడ్‌న్యూస్‌ చెప్పింది. మార్చి25న ఈ సినిమాను ఒకేసారి డిస్నీ+ హాట్‌స్టార్‌తో పాటు ఆహాలో రిలీజ్‌ చేయనున్నారు. ఇదే విషయాన్ని ట్విట్టర్‌లో అధికారికంగా ప్రకటించారు. కాగా మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే రోజు భీమ్లా నాయక్‌ సైతం ఓటీటీలో విడుదల కానుంది.Show Full Article
Print Article
Next Story
More Stories