నాగ చైతన్య "దూత" కోసం ఇద్దరు హీరోయిన్లు

నాగ చైతన్య "దూత" కోసం ఇద్దరు హీరోయిన్లు

admin1
Published on: 10 March 2022 1:00 PM IST
Two heroines for Naga Chaitanya  Dootha Web Series | Tollywood News
X

నాగ చైతన్య "దూత" కోసం ఇద్దరు హీరోయిన్లు

Naga Chaitanya Web Series : అక్కినేని యువ హీరో నాగచైతన్య ఈ మధ్యనే "బంగార్రాజు" సినిమాతో మంచి హిట్ ను అందుకున్నారు. ప్రస్తుతం నాగచైతన్య చేతిలో బోలెడు సాలిడ్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇప్పటికే టాలెంటెడ్ ఫీల్మ్ మేకర్ విక్రమ్ కే కుమార్ డైరెక్షన్లో నాగ చైతన్య ప్రస్తుతం "థ్యాంక్ యూ" సినిమాతో బిజీగా ఉన్నారు. అమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్న "లాల్ సింగ్ చద్దా" సినిమాతో బాలీవుడ్లో కూడా అడుగు పెట్టబోతున్న నాగ చైతన్య మరోవైపు "దూత" అనే వెబ్ సిరీస్ పోటీలలో కూడా అడుగుపెట్టనున్నారు.

హారర్ థ్రిల్లర్ గా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కనుంది. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ అమేజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ కానుంది. ఇప్పుడు ఈ సిరీస్ పై ఒక లేటెస్ట్ అప్డేట్ ఒకటి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సిరీస్ లో మళయాళ టాలెంటెడ్ నటి ప్రియా భవాని శంకర్ మరియు పార్వతి లు నటిస్తున్నట్టు కన్ఫర్మ్ అయ్యింది. ఇక వీరంతా కలిసి ఉన్న ఫోటో కూడా ఒకటి బయటకి వచ్చి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఈ సిరీస్ ఎప్పుడు విడుదల అవుతుందో చూడాలి.

admin1

admin1

Next Story