నాని కోసం రెండు క్లైమాక్స్ లు

నాని కోసం రెండు క్లైమాక్స్ లు
x
Highlights

న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం 'జెర్సి' సినిమా తో బిజీగా ఉన్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లతో బిజీగా ఉన్న నాని 'భీమిలి కబడ్డీ జట్టు' తర్వాత నాని...

న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం 'జెర్సి' సినిమా తో బిజీగా ఉన్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లతో బిజీగా ఉన్న నాని 'భీమిలి కబడ్డీ జట్టు' తర్వాత నాని చేస్తున్న ఫుల్ లెన్త్ స్పోర్ట్స్ డ్రామా ఇది. అయితే తాజాగా సినిమా కథ ప్రకారం హీరో పాత్రకు ట్రాజిక్ ఎండింగ్ ని సిద్ధం చేశాడు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. కానీ ట్రాజిక్ ఎండింగ్ ఉన్న సినిమాలు తెలుగులో క్లిక్ అయినవి చాలా తక్కువ. మరి ఈ సినిమా ఎంత వరకు వర్క్ అవుతుంది అని అనుమానం చిత్రబృందం కి కూడా కలిగింది. అందుకోసమే నాని మరియు గౌతమ్ కలిసి ఒక ప్లాన్ వేశారు.

సినిమాకు రెండు వెర్షన్ల క్లైమాక్స్ షూట్ చేశారట. సినిమా కాపీ ని త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పాటు పంపిణి హక్కులు కొన్న దిల్ రాజు కు చూపించి ఏ వెర్షన్ వాడాలి అని నిర్ణయం తీసుకొనున్నారట. ఒకవేళ ఒకే క్లైమాక్స్ తీసి అది నచ్చలేదు అనిపిస్తే మళ్ళి రీ షూట్ చేయడం అంటే బడ్జెట్ భారీగా పెరుగుతుంది. అందుకే నాని గౌతమ్ లు చాలా తెలివిగా ఇలా ప్లాన్ చేశారు. మరి ఈ సినిమాకి ఎలాంటి ఎండింగ్ ఉంటుందో చూడాలి. శ్రద్ధా శ్రీనాధ్ హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచాయమవుతోంది. 'జెర్సి' వచ్చే నెల 5 న విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories