పవన్ కళ్యాణ్ కోసం చేతులు కలపనున్న ప్రముఖ నిర్మాణ సంస్థలు

Two Big Production Houses Gearing up for Collaboration for Pawan Kalyan
x

పవన్ కళ్యాణ్ కోసం చేతులు కలపనున్న ప్రముఖ నిర్మాణ సంస్థలు

Highlights

"ఆర్ ఆర్ ఆర్", "పుష్ప" నిర్మాతలతో చేతులు కలపనున్న పవన్ కళ్యాణ్

Pawan Kalyan: ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలు తమ సినిమాల కోసం కేవలం ఒక నిర్మాణ సంస్థ మీదే ఆధారపడకుండా రెండు మూడు సంస్థలను సంయుక్తంగా చేసి సినిమాలను నిర్మిస్తున్నారు. ఇప్పటికే "మహర్షి" సినిమా కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు పీవీపీ, దిల్ రాజు మరియు అశ్విని దత్ వంటి స్టార్ నిర్మాతలను చేతులు కలిపేలా చేశారు. ఈ మధ్యనే "సర్కారు వారి పాట" సినిమా కోసం కూడా మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్స్ ప్లస్ బ్యానర్ వారు సంయుక్తంగా సినిమాని నిర్మించారు.

టాలీవుడ్ లో ఇలాంటి కొలాబరేషన్లు ఇప్పటికే చాలా సినిమాలకు జరిగాయి. అయితే తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తదుపరి సినిమా కోసం ఇప్పుడు టాలీవుడ్ లో ఉన్న రెండు ప్రముఖ నిర్మాణ సంస్థలు చేతులు కలుపుతున్నాయి. అవి మైత్రి మూవీ మేకర్స్ మరియు డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలు.

"ఆర్ఆర్ఆర్" వంటి బ్లాక్ బస్టర్ నిర్మించిన డివివి ఎంటర్టైన్మెంట్స్ మరియు "పుష్ప" సినిమాని నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ వారు సంయుక్తంగా పవన్ కళ్యాణ్ సినిమాని నిర్మించనున్నారు. సాహో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేయాల్సి ఉంది. ఈ సినిమా కోసం డీవీవీ దానయ్య మరియు మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ ను అందిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలవడనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories