Salman Khan: సల్మాన్‌ఖాన్ ఇంటి దగ్గర కాల్పుల ఘటనలో ఇద్దరు అరెస్ట్

Salman Khan: నిందితులు వికీ గుప్తా, సాగర్ పాల్‌గా గుర్తింపు

Jyothi
Published on: 16 April 2024 8:43 AM IST
Two Arrested In Salman Khan House Firing Incident
X

Salman Khan: సల్మాన్‌ఖాన్ ఇంటి దగ్గర కాల్పుల ఘటనలో ఇద్దరు అరెస్ట్

Salman Khan: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నివాసం వద్ద కాల్పులకు పాల్పడిన ఇద్దరు నిందితులను ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. గుజరాత్‌లోని భుజ్ వద్ద వారిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు ప్రకటించారు. కాల్పులు జరిపిన తర్వాత ముంబయి నుంచి నిందితులు గుజరాత్‌లోకి భుజ్‌కు పారిపోయారని చెప్పారు. తదుపరి విచారణ కోసం వారిని ముంబయికి తీసుకురానున్నట్టు వెల్లడించారు. ఇటీవల సల్మాన్ ఉంటోన్న ముంబయిలోని బంద్రా గెలాక్సీ అపార్ట్‌మెంట్ బయట బైక్‌వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపి పరారయ్యారు.

ఈ ఘటనతో అప్రమత్తమైన ముంబయి పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చేపట్టారు. తమను ఎవరూ గుర్తుపట్టకుండా హెల్మెట్లు ధరించి ద్విచక్రవాహనంపై వచ్చిన దుండగులు.. దాడికి ప్రయత్నించినట్టు ప్రాథమిక విచారణంలో నిర్దారించారు. మొత్తం నాలుగు రౌండ్ల కాల్పులు జరపగా.. ఓ బుల్లెట్ సల్మాన్ ఇంటి బాల్కనీలోకి దూసుకెళ్లింది. ఇటీవల కాల్పుల ఘటనకు సంబంధించి ముంబయి క్రైమ్ బ్రాంచ్ ఇద్దరు వ్యక్తులను విచారణకు పిలిచింది.

Jyothi

Jyothi

Next Story