యాక్టర్ నరేశ్ పెళ్లి వ్యవహారంలో ట్విస్ట్

* కోర్టును ఆశ్రయించిన నటుడు నరేశ్

Dhatripriya
Updated on: 27 Jan 2023 11:43 AM IST
Twist In Actor Naresh Wedding Affair
X

యాక్టర్ నరేశ్ పెళ్లి వ్యవహారంలో ట్విస్ట్

Naresh: తెలుగు యాక్టర్ నరేశ్ పెళ్లి వ్యవహారంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. తన భార్య రమ్య రఘుపతి, రోహిత్ శెట్టితో ప్రాణహాని ఉందని హైకోర్టులో నరేశ్ పిటిషన్ దాఖలు చేశారు. 2010 మార్చి 3న బెంగుళూరులో రమ్యతో వివాహం జరిగిందని నరేశ్ చెప్పారు. పెళ్లికి కట్నం తీసుకోలేదని కోర్టుకు చెప్పారాయన రమ్యకు 30 లక్షల రూపాయలతో తన తల్లి విజయనిర్మల బంగారం చేయించిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. పెళ్లయిన కొన్ని నెలల నుంచే వేధింపులు మొదలయ్యాయని చెప్పారు. విడాకులు ఇప్పించాలని నరేశ్ కోర్టును కోరారు.

తన తల్లితో పాటుగా బెంగళూరులోనే ఉండాలని రమ్య షరతు విధించిందన్నారు. రమ్యకు తనకు 2012 లో రణ్‌వీర్ జన్మించాడని తెలిపారు. తనకు తెలియకుండానే పలు బ్యాంకులు, తమరు వ్యక్తుల దగ్గర డబ్బు తీసుకుందని కోర్టుకు నివేదించారు. తన పేరు చెప్పి లక్షల్లో అప్పులు చేసిందన్నారు. 10 లక్షల రూపాయల అప్పు తీర్చానని చెప్పారు. తన కుటుంబ సభ్యుల నుంచి మరో 50 లక్షల రూపాయలు తీసుకుందన్నారు. తన ఆస్తి కాజేయడానికి రమ్య ప్రయత్నించిందని ఆరోపించారు. అప్పు ఇచ్చిన వారు ఇంటికి వచ్చి తనను వేధించేవారని, ఆస్తి కాజేయడానికి రమ్య ప్రయత్నించిందని కోర్టుకు దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు.

సుపారి గ్యాంగుతో తనను చంపేందుకు రమ్య ప్రయత్నించిందని ఆరోపించారు. 2022 ఏప్రిల్‌లో కొంతమంది అగంతకులు తన ఇంట్లో చొరబడ్డారని, 24 లక్షల రూపాయలు రికవరీ చేయడానికి వచ్చామని మాయమాటలు చెప్పారని అన్నారు. ఈ ఘటనపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానన్నారు. రమ్యకు తాను డబ్బులు ఇవ్వకపోవడంతో పలు రకాలుగా చంపాలని చూసిందని ఆరోపించారు. కాంగ్రెస్ లీడర్ రఘువీరారెడ్డితో ఫోన్ చేయించి బెదిరించిందని, తనను చంపేస్తారని భయంతో ఎక్కడికి ఒంటరిగా వెళ్లడం లేదన్నారు. తనకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ ద్వారా హ్యాకింగ్ నేర్చుకుందని, తన ఫోన్‌ను హ్యాక్ చేసి పర్సనల్ మెసేజీలు చూసేదన్నారు. రమ్యతో నరకయాతన అనుభవించానని, ఆమె వేధింపులు భరించలేకపోతున్నానని, అందువల్ల విడాకులు ఇప్పించాలని కోరారు.




Dhatripriya

Dhatripriya

Next Story