Keerthi Dhanush: ఘ‌నంగా డాక్టర్‌ బాబు మ‌ర‌ద‌లి సీమంతం

Keerthy -Dhanush
x

కీర్తి-ధ‌నుష్

Highlights

Keerthi Dhanush: తెలుగు సీరియల్‌ నటి కీర్తి సీమంతం వేడుక ఘనంగా జరిగింది

Keerthi Dhanush: తెలుగు సీరియల్‌ నటి కీర్తి సీమంతం వేడుక ఘనంగా జరిగింది. తన నివాసంలో అతి కొద్దిమంది బంధువులు, సన్నిహితుల స‌మ‌క్షంలో నిర్వ‌హించారు. ఆమె సీమంతానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. న‌టి కీర్తి ప్ర‌ముఖ చాన‌ల్ లో ప్ర‌సారం అవుతున్న హిట్ల‌ర్ గారి పెళ్లాం సీరియ‌ల్ లో న‌టిస్తుంది. కీర్తి భర్త ధనుష్‌ కూడా సీరియల్స్‌లో నటిస్తున్నారు. కీర్తి-దనుష్‌ మొదటిసారి తల్లిదండ్రులు కానుండటంతో నెటిజన్లు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

కీర్తి అక్కా-బావ ఇద్ద‌రూ న‌టీన‌టులే అన్న సంగ‌తి అంద‌రికి తెలిసిందే. కీర్తి బావ నిరుపమ్ ప‌రిటాల బుల్లితెర‌లో ప్రసారం అవుతున్న‌ కార్తీకదీపం సీరియల్ లో న‌టిస్తున్నాడు. ఈ సీరియల్లో డాక్టర్‌బాబు పాత్ర ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పాపులర్ అయ్యాడు నిరుప‌మ్. అలాగే హిట్ల‌ర్ గారి పెళ్లాం, కుంకుమ పువ్వూ సీరియ‌ల్స్ లో కూడా న‌టిస్తున్నాడు. కీర్తి అక్క మంజుల ప‌రిటాల కూడా ప‌లు సీరియ‌ల్స్ లో బీజీగా ఉంది.

ఇక కీర్తి కన్నడ సీరియల్స్‌తో బాగా గుర్తింపు పొందింది. తెలుగులోనూ పలు సీరియల్స్‌లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం కీర్తి ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కీర్తి త‌న బుల్లితెర‌పై త‌న‌ న‌ట‌న‌తో ఎంతో మంది ఫ్యాన్స్ ను సంపాదించుకుంది. కీర్తి-ధ‌నుష్ ప్రేమ వివాహం చేసుకున్న సంగ‌తి అంద‌రికి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories