డ్రగ్స్ కొనుగోలు చేస్తూ అడ్డంగా దొరికిపోయిన నటి!

డ్రగ్స్ కొనుగోలు చేస్తూ అడ్డంగా దొరికిపోయిన నటి!
x
Highlights

ముంబైలో ఓ టీవీ ఆర్టిస్ట్ డ్రగ్స్ కొనుగోలు చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు దొరికిపోయింది.

మళ్ళీ ముంబాయిలో డ్రగ్స్ కలకలం రేగింది. ఈసారి రెడ్ హ్యాండెడ్ గా ఓ నటి డ్రగ్స్ కొనుగోలు చేస్తూ దొరికిపోయింది. యువ నటుడు సుశాంత్ ఆత్మహత్య తరువాత బాలీవుడ్ లో డ్రగ్స్ విషయమై పెద్ద దుమారమే రేగుతోంది. ఈ నేపధ్యంలో ఈరోజు ఒక నటి డ్రగ్స్ కొనుగోలు చేస్తూ దొరికిపోవడం సంచలనం సృష్టించింది.

ముంబై లోని వేర్సోనా ప్రాంతంలో ప్రముఖ టీవీ నటి ప్రీతికా చౌహాన్ డ్రగ్స్ కొనుగోలు చేస్తుండగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు. ముందుగా అందిన సమాచారం మేరకు సివిల్ డ్రస్ లో ఆ ప్రాంతానికి వెళ్ళిన అధికారులు.. ప్రీతికా డ్రగ్స్ కొనుగోలు చేస్తుండగా పట్టుకుని అరెస్ట్ చేశారు. వెర్సోవా లోని మచ్చిమార్ ప్రాంతంలో శనివారం సాయంత్రం 7 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఫైజల్ అనే యువకుని దగ్గర నుంచి ప్రీతికా డ్రగ్స్ కొనుగోలు చేసింది. ఈ సమయంలో అధికారులు వారిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 99 గ్రాముల గంజాయి తొ పాటు, మారిజునా మత్తు పదార్ధాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీరినే కాకుండా అదే ప్రాంతంలో దీపక్ రాథోర్ అనే వ్యక్తిని పోలీసులు తరువాత అరెస్ట్ చేశారు.

అటు తరువాత మహమ్మద్ అలీ రోడ్డులోని మసీద్ సమీపంలో బ్రూనో జాన్ ఎంగ్వాలే అనే ఓ టాంజానియన్‌ని, అతనిచ్చిన సమాచారంతొ వెర్సోవా ప్రాంతంలో రోహిత్ హిరె అని వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి అధికారులు 4గ్రా. కొకైన్‌,1.88గ్రా. ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. అంతే కాకుండా మరికొంత మంది నుంచి దాదాపు 325గ్రా. మారిజునా,32గ్రా చరాస్,5గ్రా. మెథాంఫెటమైన్‌తో రూ.12,990 నగదు,ఒక వాహనం స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్ట్ లతొ బాలీవుడ్ లో మరింత కలకలం రేగింది.

Show Full Article
Print Article
Next Story
More Stories