పోలీసుల ఎదుట లొంగిపోయిన దేవరాజు

Arun Chilukuri
Published on: 10 Sept 2020 2:15 PM IST
పోలీసుల ఎదుట లొంగిపోయిన దేవరాజు
X

టీవీ నటి కొండపల్లి శ్రావణి ఆత్మహత్య కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవరాజు ఇవాళ ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసు స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడని సీఐ నర్సింహారెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు అజ్ఞాతంలో ఉన్న దేవరాజ్‌ లొంగిపోవడంతో అతన్ని ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసులు విచారిస్తున్నారు. టిక్‌టాక్‌లో శ్రావణికి పరిచయమైన దేవరాజ్‌ ఫోటోలు, వీడియోలతో శ్రావణికి బెదిరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఇక దేవరాజ్‌ వేధింపులపై జూన్‌లోనే ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసులకు శ్రావణి ఫిర్యాదు చేసింది. కేసు విచారణలో ఉండగానే శ్రావణి సూసైడ్‌ చేసుకుంది. విచారణ తర్వాత నిందితులు ఎవరైనా సరే అరెస్టు చేస్తామని సీఐ నర్సింహారెడ్డి స్పష్టం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story