logo
సినిమా

ఒక్కొక్కటిగా బయటకొస్తున్న దేవ్‌రాజ్‌ లీలలు..

ఒక్కొక్కటిగా బయటకొస్తున్న దేవ్‌రాజ్‌ లీలలు..
X
Highlights

టీవీ నటి కొండపల్లి శ్రావణి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి...

టీవీ నటి కొండపల్లి శ్రావణి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. శ్రావణి ఆత్మహత్యకు కారణం కాకినాడ గొల్లప్రోలుకు చెందిన దేవరాజురెడ్డి కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించారు. శ్రావణి కేసులో ప్రముఖంగా వినిపిస్తున్న దేవరాజురెడ్డి లీలలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. టిక్‌టాక్‌లో స్నేహం పేరుతో అమ్మాయిల వద్ద డబ్బు వసూలు చేసినట్టు సమాచారం. గతంలోనే దేవ్‌రాజ్ భాగోతంపై ఎస్సార్‌నగర్‌ పీఎస్‌లో శ్రావణి ఫిర్యాదు చేసింది. ఒకరికి తెలియకుండా ఒకరిని ప్రేమించినట్లు ఫిర్యాదులో వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రేమించి, మొహం చాటేయడంతో మనస్తాపానికి గురైన శ్రావణి ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబసభ్యులు దేవరాజుపై ఆరోపణలు చేస్తున్నారు.

Web TitleTV actress Sravani suicide accused Devaraju's extortions revealed
Next Story