మరోసారి ఢిల్లీకి గవర్నర్ తమిళి సై.. ప్రధాని మోడీతో భేటీ...

మరోసారి ఢిల్లీకి గవర్నర్ తమిళి సై.. ప్రధాని మోడీతో భేటీ...
Tamilisai Soundararajan: రాష్ట్రంలోని తాజా పరిస్థితులను ప్రధాని వివరించే ఛాన్స్...
Tamilisai Soundararajan: తెలంగాణ గవర్నర్ తమిళి సై(Tamilisai Soundararajan) మరోసారి ఢిల్లీ ఫ్లైట్ ఎక్కునున్నారు. కొద్ది రోజుల క్రితం గవర్నర్ ఢిల్లీ టూర్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపణలు రేపింది. ప్రోటోకాల్ అంశాలపై ప్రధాని మోడీ(PM Narendra Modi) కి, హోమంత్రి అమిత్‌షా(Amit Shah) కు ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనను వ్యక్తిగతంగా అవమానించటం కాదని.. గవర్నర్ వ్యవస్థను అవమానిచారని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యల పైన తెలంగాణ మంత్రులు సైతం కౌంటర్ ఇచ్చారు.
కేంద్ర సహాయమంత్రి జితేందర్ సింగ్ కుమారుడి వివాహానికి గవర్నర్ హాజరుకానున్నారు. ఇవాళ మరోసారి ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసే అవకాశం వుందని తెలుస్తోంది. తెలంగాణలో డ్రగ్స్ వ్యవహారంపై నివేదిక ఇచ్చినట్లుగా గత పర్యటనలో ప్రచారం జరిగింది. ఇక, రాష్ట్రంలోని తాజా పరిస్థితుల పైన మరోసారి ప్రధానితో సమావేశమైన సమయంలో గవర్నర్ వివరించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
రాష్ట్రంలో పరిస్థితుల పైన తాను ప్రత్యేకంగా ప్రధాని - హోం మంత్రికి చెప్పాల్సిన అవసరం లేదని..అన్నీ వారికి తెలుసంటూ గవర్నర్ వ్యాఖ్యానించారు. దీంతో..ఇప్పుడు మరోసారి గవర్నర్ ఢిల్లీ టూర్ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ కనిపిస్తోంది. మరోవైపు సీఎం కేసీఆర్ సైతం ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర లక్ష్యంగా హస్తిన బాటపట్టనున్నారు.
జాతీయ రైతు సంఘం నాయకులతో భేటి అవుతారని తెలుస్తుంది. ఢిల్లీ నుండి సీఎం కేసీఆర్(KCR) యూపీ వెళ్లనున్నారు. బీజేపీ రైతు వ్యతిరేక విధానాలపై ఆయా సంఘాలతో సమావేశం కానున్నారు. రైతు సంఘం నాయకుడు టికాయత్ తో కలిసి లఖింపూర్ కేరి(Lakhimpur Kheri) ఘటనలో చనిపోయిన రైతు కుటుంబాలకు ఆర్థికసాయం చేసే అవకాశముందని తెలుస్తోంది. అనంతరం లక్నోలో అఖిలేష్ యాదవ్ ను కలుస్తారని ప్రచారం జరుగుతోంది. బీజేపీ వ్యతిరేక విధానాలపై అఖిలేష్ యాదవ్(Akhilesh yadav) తో సీఎం కేసీఆర్ చర్చించనున్నారు.
బాసర పరిసర ప్రాంతాల్లో చిరుత కలకలం
19 Aug 2022 7:08 AM GMTరేపు మునుగోడు నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి పాదయాత్ర
19 Aug 2022 5:18 AM GMTరంగుమారిన విశాఖ సాగర తీరం
19 Aug 2022 2:57 AM GMTAP Employees: జీపీఎస్‌పై చర్చకు సిద్ధంగా లేం
19 Aug 2022 1:55 AM GMTమాణిక్కం ఠాగూర్‌కు జడ్చర్ల ఇంఛార్జ్ అనిరుధ్‌రెడ్డి లేఖ
18 Aug 2022 6:30 AM GMTసీపీఎస్‌పై ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించిన ఏపీ సర్కార్
18 Aug 2022 2:18 AM GMTఏపీ విద్యాశాఖలో నూతన అటెండెన్స్ విధానం
18 Aug 2022 2:00 AM GMT
వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడు మంజునాథ్ ఆత్మహత్య
20 Aug 2022 2:30 AM GMTబిహార్‌లో కన్నీటి పర్యంతమైన గ్రాడ్యుయేట్ ఛాయ్‌వాలీ
20 Aug 2022 2:07 AM GMTబీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్
20 Aug 2022 1:43 AM GMTఇవాళ మునుగోడులో టీఆర్ఎస్ ప్రజా దీవెన సభ
20 Aug 2022 1:28 AM GMTChandrababu: ఏపీలో దుర్మార్గపు పాలనను అంతమొందించాలి
20 Aug 2022 1:09 AM GMT