'ఆర్ఆర్ఆర్' పై కేటీఆర్ కామెంట్

ఆర్ఆర్ఆర్ పై కేటీఆర్ కామెంట్
x
Highlights

'బాహుబలి' సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' అంటూ మరొక పాన్ ఇండియన్ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు...

'బాహుబలి' సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' అంటూ మరొక పాన్ ఇండియన్ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా టైటిల్ లో 'ఆర్ ఆర్ ఆర్' కు ఫుల్ ఫార్మ్ ప్రేక్షకులే నిర్ణయిస్తారని రాజమౌళి అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అభిమానులు నిర్మాతలకు బోలెడు సూచనలు ఇస్తున్నారు. అయితే ఒక ట్విట్టరాటి ఈ విషయాన్ని స్వయంగా టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను అడిగాడు.

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే కేటీఆర్ ఈ మధ్యనే అస్క్ కేటీఆర్ అంటూ ప్రజల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. చాలా ప్రశ్నలకు తనదైన శైలిలో జవాబులు ఇచ్చిన కేటిఆర్ 'ఆర్ఆర్ఆర్' సినిమా గురించి అడిగిన ప్రశ్నకు కూడా జవాబు ఇచ్చారు. 'ఆర్ఆర్ఆర్' సినిమాకి మీరు అయితే ఏ టైటిల్ పెడతారు? అని అడుగగా, కేటీఆర్ చాలా ఫన్నీగా రియాక్ట్ అయ్యారు. "నాకు ఆసక్తి ఉన్న 'ఆర్ఆర్ఆర్' అంటే రీజనల్ రింగ్ రోడ్" అని సరదాగా జవాబిచ్చారు కేటీఆర్. ఇక డి.వి.వి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జూలైలో విడుదల కానుంది.



Show Full Article
Print Article
Next Story
More Stories