Pawan Kalyan - Trivikram: పవన్ కళ్యాణ్ చిత్రానికి త్రివిక్రమ్ మాట సహాయం

Trivikram Writing Dialogues For Pawan Kalyan Ayyappanum Koshiyum Remake Movie
x

త్రివిక్రమ్-పవన్ కళ్యాణ్ 

Highlights

తన పదునైన డైలాగ్స్ తో తెలుగు హీరోలను తెరపై మాట్లాడించే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెలుగు సినిమా పరిశ్రమలో

Pawan Kalyan - Trivikram: తన పదునైన డైలాగ్స్ తో తెలుగు హీరోలను వెండితెరపై మాట్లాడించే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెలుగు సినిమా పరిశ్రమలో ఉండటం అటు హీరోలకి, హీరోలను అభిమానించే అభిమానులకు ఒక వరం అనే చెప్పొచు. తను ఇప్పటివరకు చేసిన ప్రతి చిత్రంలో తన కథ-కథనంతో పాటు మాటలతో ప్రేక్షులను మంత్ర ముగ్దులను చేసే త్రివిక్రమ్ స్టార్ హీరోలతో సమానంగా తనకంటూ అభిమానులను సంపాందించుకున్నాడు. తాజాగా పవన్ కళ్యాణ్ "అయ్యపన్ కోషియమ్" రీమేక్ సినిమాకి త్రివిక్రమ్ మాటలను అందించనున్నాడనే వార్తతో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని తెలుగులో పవన్ కళ్యాణ్ మరియు రానా హీరోలుగా సాగర్ చంద్ర దర్శకత్వంలో నాగవంశీ నిర్మాతగా తెరకెక్కించబోతున్నారు.

ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన మొదట నిత్య మీనన్ అనుకున్న తాజాగా సాయి పల్లవిని ఎంపిక చేసారనే వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. "అజ్ఞాతవాసి" చిత్రంతో భారీ పరాజయాన్ని మూటగట్టుకున్న పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ఆ సినిమా తర్వాత "అరవింద సమేతా" చిత్రంతో దర్శకుడిగా త్రివిక్రమ్, "వకీల్ సాబ్" సినిమాతో పవన్ కళ్యాణ్ భారీ విజయాన్ని సాధించారు. అయితే జల్సా చిత్రం నుండి మంచి మిత్రులుగా ఉన్న ఈ ఇద్దరు అటు సినిమాతోనే కాకుండా వ్యక్తిగత విషయాలను పంచుకుంటారని పలు ఆడియో ఫంక్షన్స్ లో పవన్, త్రివిక్రమ్ చెప్పిన సందర్భాలు చూశాము. తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్ సినిమాకి త్రివిక్రమ్ మాట సహాయం చేస్తుండటంతో ఇప్పటి వరకు మెగా అభిమానుల్లో ఈ సినిమాకి ఉన్న క్రేజ్ మరింత పెరిగిందనే అనుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories