తమన్ సంగీతంతో డిసప్పాయింట్ అయిన త్రివిక్రమ్

Trivikram Disappointed With Music Director Thaman’s Work
x

తమన్ సంగీతంతో డిసప్పాయింట్ అయిన త్రివిక్రమ్

Highlights

Trivikram Srinivas: ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ చాలా వరకు తన సినిమాలలో పాటలకు పెద్దపీట వేస్తూ ఉంటారు.

Trivikram Srinivas: ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ చాలా వరకు తన సినిమాలలో పాటలకు పెద్దపీట వేస్తూ ఉంటారు. అందుకే చాలా వరకు త్రివిక్రమ్ సినిమాలన్నీ మ్యూజికల్ హిట్స్ కూడా అవుతాయి. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన కొన్ని సినిమాలకు అదిరిపోయే మ్యూజిక్ ను అందించారు. ఉదాహరణకు త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన అరవింద సమేత అలా వైకుంఠపురంలో వంటి సినిమాలకు తమన్ సంగీతాన్ని అందించారు.

ఈ రెండు సినిమాల్లోనూ పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఇప్పుడు తమన్ త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సినిమాకి కూడా సంగీతాన్ని అందించబోతున్నారు. ఈ కాంబోలో రాబోతున్న సినిమాకి కూడా సంగీతం హైలైట్ గా మారనుంది అని అభిమానులు ఇప్పట్నుంచే చెబుతున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం త్రివిక్రమ్ మరియు తమన్ కి ఈమధ్య ఒకరితో ఒకరికి పడటం లేదట. చిత్ర బృందం ఫిబ్రవరి మొదటి వారంలో ఒక పాట షూటింగ్ను ప్లాన్ చేసింది. ఆ పాట కోసం తమన్ అందించిన ట్యూన్ ఆప్షన్లు త్రివిక్రమ్ కి అసలు నచ్చలేదట. అందుకే తమన్ ను ఆ పాట పై మళ్లీ రివర్క్ చేయమని త్రివిక్రమ్ సూచించినట్లు తెలుస్తోంది.

దీనివల్ల ఈ పాట షూటింగ్ కూడా వాయిదా వేయాల్సి వచ్చింది. పాటల విషయంలో త్రివిక్రమ్ ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వట్లేదని తెలుస్తోంది. "అతడు" మరియు "ఖలేజా" వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత త్రివిక్రమ్ మరియు మహేష్ బాబు కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న మూడవ సినిమా ఇది. పూజ హెగ్డే మరియు శ్రీ లీల హీరోయిన్లుగా కనిపిస్తున్న ఈ సినిమాని హారిక హాసిని క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories