Jr NTR-Trivikram Srinivas: ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమా కోసం భారీ బడ్జెట్ పెడుతున్న నిర్మాతలు

Jr NTR-Trivikram Srinivas: ప్యాన్ ఇండియన్ రేంజ్ సినిమా తీయబోతున్న త్రివిక్రమ్

admin1
Updated on: 12 Feb 2022 7:30 PM IST
Trivikram To Shoot Pan Indian Movie | Tollywood News
X

ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమా కోసం భారీ బడ్జెట్ పెడుతున్న నిర్మాతలు

Jr NTR-Trivikram Srinivas: నిజానికి "ఆర్ ఆర్ ఆర్" సినిమా తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేశారు. "అరవింద సమేత" వంటి హిట్ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో మరో బ్లాక్ బస్టర్ వస్తుందని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ ఈ సినిమా మొదలు పెట్టకుండానే ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా ఒప్పుకొన్నారు. మరోవైపు త్రివిక్రమ్ కూడా మహేష్ బాబుతో సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా క్యాన్సిల్ అవ్వలేదని, కేవలం వాయిదా మాత్రమే పడిందని ఇది కూడా ప్యాన్ ఇండియన్ రేంజ్ లో విడుదల కాబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

త్రివిక్రమ్ మరియు ఎన్టీఆర్ ఇద్దరూ తమ కమిట్ మెంట్ లను పూర్తి చేసుకొని తమ సినిమాని మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ సినిమా షూటింగు పట్టాలెక్కడానికి కనీసం ఒక సంవత్సరం అయినా పడుతుంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నట్లు నిర్మాతలు కూడా చెబుతున్నారు. ఎన్టీఆర్ మరియు త్రివిక్రమ్ ఇద్దరి కెరీర్ లోనూ ఇది భారీ బడ్జెట్ సినిమా కాబోతుందట. ఇక మరోవైపు ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో నటించిన "ఆర్ఆర్ఆర్" థియేటర్లలో విడుదల కాబోతుంది. మరోవైపు త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది.

admin1

admin1

Next Story