మహేష్ బాబు కోసం టైటిల్ వేట మొదలుపెట్టిన త్రివిక్రమ్

Trivikram: టైటిల్ కోసం త్రివిక్రమ్ చేస్తున్న కసరత్తు..

Jyothi
Updated on: 15 March 2023 6:00 PM IST
Trivikram Started the Title Hunt for Mahesh Babu
X

మహేష్ బాబు కోసం టైటిల్ వేట మొదలుపెట్టిన త్రివిక్రమ్

Trivikram: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. "అతడు" మరియు "ఖలేజా" వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మూడవ సినిమా ఇది. ఇక ఈ సినిమాపై ప్రేక్షకులకు ఒక రేంజ్ లో అంచనాలు ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకి సంబంధించిన ప్రతి అప్డేట్ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా #ఎస్ఎస్ఎంబీ28 అనే వర్కింగ్ టైటిల్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. మరి ఈ సినిమాకి అసలైన టైటిల్ ఏం పెట్టబోతున్నారు అని అభిమానులు ఎప్పటినుంచో డిస్కషన్లు మొదలుపెట్టేసారు. తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు త్రివిక్రమ్ కూడా అదే పనిలో పడ్డట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోసం త్రివిక్రమ్ టైటిల్ వేటని మొదలు పెట్టారట. ఒకవైపు సినిమా పనులతో త్రివిక్రమ్ చాలా బిజీగా ఉన్నప్పటికీ టైటిల్ డిసైడ్ చేయడం విషయంలో కూడా కసరత్తు మొదలుపెట్టేశారట.

ఈసారి అభిమానులు ఊహించినటువంటి ఒక విభిన్న టైటిల్ ను పెట్టాలని త్రివిక్రమ్ అనుకుంటున్నారట. ఇక ఈ సినిమా టైటిల్ కూడా "అ" అనే అక్షరం తోనే మొదలవుతుందట. త్రివిక్రమ్ కి "అ" అనే అక్షరంతో టైటిల్ పెట్టిన ప్రతి సినిమా సూపర్ హిట్ అయిన సెంటిమెంట్ ఆల్రెడీ ఉంది. అందుకే ఈ సినిమా కోసం కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ "అ" అనే అక్షరంతో మొదలయ్యే టైటిల్ పెట్టాలని నిర్ణయించుకున్నారట.

Jyothi

Jyothi

Next Story