Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా కోసం భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిన డైరెక్టర్

Pawan Kalyan: "భీమ్లా నాయక్" సినిమా కోసం భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న త్రివిక్రమ్

admin1
Updated on: 29 Nov 2021 6:30 PM IST
Trivikram Srinivas Takes the 15 Crores for Pawan Kalyan Bheemla Nayak Movie
X

పవన్ కళ్యాణ్ సినిమా కోసం భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ (ఫైల్ ఇమేజ్)

Pawan Kalyan: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మధ్యనే "అల వైకుంఠపురం లో" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే ఇక ప్రస్తుతం "భీమ్లా నాయక్" సినిమాతో బిజీగా ఉన్నారు మాటల మాంత్రికుడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా కి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రిప్టు అందిస్తున్నారు. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన"అయ్యప్పనుం కోషీయుం" సినిమాకి రీమేక్ గా తెరకెక్కనుంది.

ఈ సినిమా కోసం త్రివిక్రమ్ కేవలం స్క్రీన్ ప్లే, డైలాగులు మాత్రమే అందిస్తున్నారు. దీని కోసమే త్రివిక్రమ్ భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. కేవలం ఈ ఒక్క సినిమాకి డైలాగులు మరియు స్క్రీన్ ప్లే కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏకంగా 15 కోట్ల వరకు తీసుకుంటున్నారట. అయితే 15 కోట్లు మాత్రమే కాకుండా సినిమా హిట్టయితే ప్రాఫిట్స్ లో వచ్చే 60 శాతం అమౌంట్ కూడా త్రివిక్రమ్ కి సొంతం కాబోతున్నట్లు తెలుస్తోంది.

admin1

admin1

Next Story