రామ్, అనుపమలతో త్రివిక్రమ్ మూవీ?

గత ఏడాది పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మళ్ళీ మంచి ఫాంలోకి వచ్చాడు హీరో రామ్... ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో రెడ్ అనే సినిమాని చేస్తున్నాడు.

Krishna
Published on: 2 Nov 2020 2:50 PM IST
రామ్, అనుపమలతో త్రివిక్రమ్ మూవీ?
X

గత ఏడాది పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మళ్ళీ మంచి ఫాంలోకి వచ్చాడు హీరో రామ్... ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో రెడ్ అనే సినిమాని చేస్తున్నాడు. దాదాపుగా చివరి దశకు వచ్చిన ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి ధియేటర్లలలో రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ సినిమా తర్వాత రామ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమాని చేయనున్నాడని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో రామ్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించనుందని తెలుస్తోంది. ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు జరగగా ఆమె కూడా ఒకే చెప్పినట్టుగా సమాచారం.. "అ ఆ" సినిమాతో మలయాళీ భామ అనుపమను టాలీవుడ్ కి పరిచయం చేశాడు త్రివిక్రమ్.. అటు రామ్ తో కూడా హలో గురు ప్రేమ కోసమే అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది అనుపమ.. ఇక ఈ సినిమాని 40 కోట్ల బడ్జెట్ లోనే తెరకెక్కించనున్నారట..

ఎప్పటిలాగే హారిక హాసిని క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాని నిర్మించనుందని తెలుస్తోంది. దీనిపైన త్వరలో అధికార ప్రకటన వెలువడనుంది. అటు ఎన్టీఆర్ తో చేయాల్సిన సినిమా ఆలస్యం అవుతుండడంతో త్రివిక్రమ్, రామ్ తో సినిమా చేసేందుకు ప్లాన్ చేశారని టాక్.. వచ్చే ఏడాది సినిమా మొదలు కానుంది. అటు ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న RRR అనే సినిమాలో నటిస్తున్నాడు.. ఈ సినిమా పూర్తి అయిన తర్వాత త్రివిక్రమ్ మూవీకి షిఫ్ట్ కానున్నాడు ఎన్టీఆర్..

Krishna

Krishna

Next Story