Trivikram Srinivas: ప్యాన్ ఇండియన్ సినిమా ప్లాన్ చేస్తున్న త్రివిక్రమ్

Trivikram Srinivas: ప్యాన్ ఇండియన్ డైరెక్టర్ గా మారాలి అనుకుంటున్న త్రివిక్రమ్

admin1
Published on: 4 Jan 2022 6:03 PM IST
Trivikram Srinivas is Planning a Pan Indian Movie | Tollywood News Online
X

ప్యాన్ ఇండియన్ సినిమా ప్లాన్ చేస్తున్న త్రివిక్రమ్

Trivikram Srinivas: గడిచిన పదేళ్లలో స్టార్ టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కెరీర్ లో ఫ్లాప్ సినిమాల కంటే బ్లాక్బస్టర్ లు ఎక్కువగా ఉంటాయి. "అఆ", "సన్నాఫ్ సత్యమూర్తి", "అత్తారింటికి దారేది" సినిమాలతో బ్లాక్ బస్టర్ అందుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మధ్యనే అల్లు అర్జున్ హీరోగా "అల వైకుంఠ పురం లో" సినిమా తో మరొక బ్లాక్బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నారు. అప్పటిదాకా టాలీవుడ్లో నెంబర్వన్ డైరెక్టర్గా ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ని "బాహుబలి" సినిమా తో రాజమౌళి ఓడించి మొదటి స్థానాన్ని ఆక్రమించారు. నిజానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఒకానొక సమయంలో 200 కోట్ల బడ్జెట్ తో ఒక ప్యాన్ ఇండియన్ సినిమాని ప్లాన్ చేసారు కానీ అది వర్కవుట్ అవ్వలేదు.

ఈ మధ్యనే "పుష్ప" సినిమా కూడా బాలీవుడ్లో మంచి విజయాన్ని సాధించిన తర్వాత త్రివిక్రమ్ కి మళ్ళీ ప్యాన్ ఇండియన్ సినిమా చేయాలనే ఆలోచన వచ్చింది. కొరటాల శివ కూడా "ఆచార్య" ప్యాన్ ఇండియన్ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే త్రివిక్రమ్ కూడా మిగతా స్టార్ డైరెక్టర్ల లాగా ప్యాన్ ఇండియన్ సినిమా ని ప్లాన్ చేస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ త్వరలో మహేష్ బాబు హీరోగా ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని ప్యాన్ ఇండియన్ సినిమాగా మార్చాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారట. కానీ మహేష్ బాబు మాత్రం అందుకు ఆసక్తి చూపించడం లేదని సమాచారం.

admin1

admin1

Next Story