నాని - త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా అటకెక్కిందా?

* త్రివిక్రమ్ - నాని మల్టీస్టారర్ సినిమాకి ఏమైంది?

Dhatripriya
Updated on: 24 March 2023 9:30 PM IST
Trivikram Srinivas And Nani Combination Movie Stuck
X

నాని - త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా అటకెక్కిందా?

Nani: న్యాచురల్ స్టార్ నాని చాలా వరకు కొత్త డైరెక్టర్లతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. తన స్క్రిప్ట్ సెలక్షన్ తో ఎప్పటికప్పుడు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటారు. అయితే చిన్న డైరెక్టర్లతో మాత్రమే కాకుండా ఎస్.ఎస్ రాజమౌళి, గౌతమ్ వాసుదేవ్ మీనన్ వంటి స్టార్ డైరెక్టర్లతో కూడా సినిమాలు చేశారు నాని. అయితే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కూడా నాని ఒక సినిమా చేయాల్సి ఉందట. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాని ఈ విషయాన్ని తెలియజేశారు.

త్రివిక్రమ్ కొన్ని ఏళ్ళ క్రితం ఒక స్క్రిప్ట్ ని రాసుకొని అందులో నానిని హీరోగా తీసుకోవాలని అనుకున్నారట. అది ఒక మల్టీస్టారర్ సినిమా అని ఇద్దరు హీరోలలో ఒకరిగా నానిని నటించమని అడిగారట. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల సినిమా పట్టాలెక్కలేదని తెలుస్తోంది. ఇక దాని గురించి మాట్లాడుతూ నాని మరొకసారి అవకాశం వస్తే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పని చేయడానికి తాను రెడీ అని అన్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఒక సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

ఆ తర్వాత అల్లు అర్జున్ తో ఒక మైథాలజికల్ సినిమా తో పాటు జూనియర్ ఎన్టీఆర్ తో కూడా మరొక సినిమా లైన్లో ఉన్నాయి. మరి ఇంత బిజీగా ఉన్న త్రివిక్రమ్ నానితో మరొకసారి సినిమా చేస్తారా లేదా అని వేచి చూడాలి. ఇక వీరిద్దరి కాంబినేషన్లో సినిమా చూడాలని అభిమానులు కూడా ఆసక్తిగానే ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం నాని శ్రీకాంత్ ఓదెల అనే కొత్త డైరెక్టర్ దర్శకత్వంలో "దసరా" అనే సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా మార్చి 30వ తేదీన థియేటర్లో విడుదల కాబోతోంది.

Dhatripriya

Dhatripriya

Next Story