ఎన్టీఆర్ తో అలాంటి సినిమా తీయనున్న త్రివిక్రమ్

* ఎన్టీఆర్ తో అలాంటి సినిమా తీయనున్న త్రివిక్రమ్

Dhatripriya
Published on: 16 Feb 2023 12:14 PM IST
Trivikram Srinivas About Jr NTR Movie
X

Trivikram Srinivas: ఎన్టీఆర్ సినిమా అలా ఉండబోతుందా?

Trivikram Srinivas: ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఒకరు. మాటల మాంత్రికుడిగా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను ప్రేక్షకులకు అందించారు. చాలా వరకు ఫ్యామిలీ డ్రామా సినిమాలను తీసే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పటిదాకా ఒకసారి కూడా మైథాలజికల్ సినిమా తీయలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం త్రివిక్రమ్ శ్రీనివాస్ కి కూడా తన తదుపరి సినిమా ని ఒక మైథాలజికల్ డ్రామాగా తెరకెక్కించనున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి.

త్రివిక్రమ్ శ్రీనివాస్ నెక్స్ట్ సినిమా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తోనే. ఎస్ ఎస్ ఎం బి 28 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. అయితే ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ఒక సినిమా చేయబోతున్నారు. ఎన్టీఆర్ తో ఇలాంటి మైతాలాజికల్ సినిమా తీస్తే బాగుంటుంది అని త్రివిక్రమ్ శ్రీనివాస్ అనుకుంటున్నారట.

పద సమాచారం ప్రకారం ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా ఒక మైతలాజికల్ డ్రామా అని తెలుస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్టీఆర్ తో ఒక హై బడ్జెట్ మైథాలజికల్ సినిమా తీస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తమ కమిట్మెంట్లు పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ మరియు త్రివిక్రమ్ ఈ సినిమా ను మొదలు పెట్టనున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story