మహేష్ బాబు సినిమాలో హీరోయిన్ గా రానా వైఫ్ !

Trivikram: అవసరం ఉన్నా లేకపోయినా హీరోయిన్ పాత్ర కు ఒక అక్కనో చెల్లినో పెట్టటం డైరెక్టర్ త్రివిక్రమ్ కి ఉన్న అలవాటు.

admin1
Published on: 26 Jan 2022 9:09 PM IST
Samyuktha  Menon is filming with Trivikram again
X

మళ్లీ త్రివిక్రమ్తో సినిమా చేస్తున్న సంయుక్త మీనన్

Trivikram: అవసరం ఉన్నా లేకపోయినా హీరోయిన్ పాత్ర కు ఒక అక్కనో చెల్లినో పెట్టటం డైరెక్టర్ త్రివిక్రమ్ కి ఉన్న అలవాటు. ఒకరకంగా త్రివిక్రమ్ ఫాలో అయ్యే సెంటిమెంట్లలో ఇది కూడా ఒకటి అని చెప్పవచ్చు. జల్సా, అత్తారింటికి దారేది, అరవింద సమేత సినిమాలలో త్రివిక్రమ్ అదే సెంటిమెంట్ ని ఉపయోగించారు. ఆ సినిమాలు బ్లాక్ బస్టర్ లు అయ్యాయి. అయితే తాజా సమాచారం ప్రకారం త్రివిక్రమ్ తన తదుపరి సినిమాలో కూడా అదే సెంటిమెంట్ ని వాడబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో సంయుక్త మీనన్ పూజాహెగ్డే సోదరిగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ స్క్రీన్ప్లే అందించిన "భీమ్లా నాయక్" సినిమాలో సంయుక్త మీనన్ రానా భార్య పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాలో తన నటనకు ఫిదా అయిన త్రివిక్రమ్ ఆమెను మహేష్ బాబు సినిమాలో కూడా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ మధ్యనే ఈ సినిమాకి సంబంధించిన చర్చలు జరిగాయి. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ సెట్స్ పైకి వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది.

admin1

admin1

Next Story