Bheemla Nayak Movie: "భీమ్లా నాయక్" ని మళ్ళీ మారుస్తున్నారా?

Bheemla Nayak Movie: "భీమ్లా నాయక్" లో మార్పులు చేర్పులు చేస్తున్న త్రివిక్రమ్

admin1
Published on: 13 Jan 2022 1:06 PM IST
Trivikram Making Changes and Additions in Bheemla Nayak Movie
X

"భీమ్లా నాయక్" ని మళ్ళీ మారుస్తున్నారా?

Bheemla Nayak Movie: సినిమా ఫైనల్ కాపీ పూర్తయిన తర్వాత విడుదల కి ఎక్కువ కాలం సమయం పట్టదు. ఎందుకంటే విడుదల వాయిదా పడే కొద్దీ దర్శక నిర్మాతలు సినిమా ను మళ్లీ మళ్ళీ చూస్తూ కొత్త మార్పులు చేర్పులు చేయాలని అనుకుంటారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తదుపరి సినిమా "భీమ్లా నాయక్" విషయంలో కూడా అదే జరుగుతున్నట్లు అనిపిస్తోంది. సినిమా ఫైనల్ కాఫీ ఇప్పటికే పూర్తి అయిపోయింది. కానీ ఇంకా విడుదలకు కొంత సమయం ఉంది. ఈ నేపథ్యంలో చిత్ర దర్శక నిర్మాతలు సినిమాని మూడు రోజుల నుంచి పదే పదే చూస్తున్నారట.

సినిమా డైరెక్టర్ సాగర్ చంద్ర ఔట్పుట్ తో సంతోషంగానే ఉన్నప్పటికీ త్రివిక్రమ్ మాత్రం అతనికి కొన్ని చిన్నచిన్న ఎడిట్ చేంజెస్ చెబుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సినిమాకి చాలా వరకు మార్పులు చేర్పులు చేశారు. సినిమా విడుదల అయ్యాక ఇక చేసేదేమీ ఉండదు కాబట్టి ఈ లోపలే ఏమైనా మార్పులు ఉంటే చేయటం మంచిదే. ఒకవేళ ఈ మార్పులు సినిమాని మరింత ఆసక్తికరంగా మారిస్తే అది అభిమానులకు కూడా మంచి వార్తే. పవన్ కళ్యాణ్ మరియు రానా హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన "అయ్యప్పనం కోషియుం" సినిమాకి తెలుగు రీమేక్ గా తెరకెక్కింది.

admin1

admin1

Next Story