ఒక స్టార్ హీరోయిన్ తో మూడేసి సినిమాలు చేస్తున్న త్రివిక్రమ్

Trivikram: ఒక స్టార్ హీరోయిన్ మూడు సినిమాలు అంటున్న త్రివిక్రమ్.

admin1
Published on: 4 Feb 2022 10:16 AM IST
Trivikram Is Making His Third Film With A Star Heroine Pooja Hegde
X

ఒక స్టార్ హీరోయిన్ తో మూడేసి సినిమాలు చేస్తున్న త్రివిక్రమ్

Trivikram: ఎంత పెద్ద స్టార్ సెలబ్రిటీ అయినా ఏదో ఒక చిన్న సెంటిమెంట్ అయినా ఉంటూనే ఉంటుంది. ఇలా చేస్తే కచ్చితంగా విజయాన్ని అందుకుంటుందని కొందరు ప్రగాడంగా నమ్ముతుంటారు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఈ కోవకి చెందినవారే. త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా చాలా సెంటిమెంట్లను ఫాలో అవుతారు. మరది సెంటిమెంటో లేక అలవాటో తెలియదు కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక స్టార్ హీరోయిన్ ని ఎంపిక చేసుకుని వరుసగా తన మూడు సినిమాలను లోను ఆమెనే హీరోయిన్గా ఉంచుతారు. ఉదాహరణకి అత్తారింటికి దారేది సినిమాలో సమంత హీరోయిన్ గా నటించింది, ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన సన్నాఫ్ సత్యమూర్తి మరియు అఆ సినిమాలలో కూడా సమంత నే హీరోయిన్గా నటించింది.

పూజా హెగ్డే విషయంలో కూడా అదే చేస్తున్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్. "అరవింద సమేత" సినిమాలో పూజా హెగ్డే నటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన "అల వైకుంఠపురం లో" సినిమాలో కూడా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ప్రేక్షకుల తెరకెక్కనున్న సినిమాలో కూడా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. మరి నెక్స్ట్ మూడు సినిమాలలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏ స్టార్ హీరోయిన్ ను ఎంచుకుంటారో చూడాలి.

admin1

admin1

Next Story