Trivikram Latest Movie: ముందు ప్రిన్స్... ఆ తరువాతే ఎన్టీఆర్

Trivikram Latest Movie: త్రివిక్రమ్‌ - సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు కాంబినేషన్‌ మరోసారి మ్యాజిక్ చేసేందుకు రెడీ అయ్యింది.

Venkata Chari
Published on: 8 April 2021 5:39 PM IST
Trivikram Dircets First Mahesh Babu SSMB28 Movie and Next NTR30 Movie
X

మహేశ్ బాబు, త్రివిక్రమ్ కొత్త సినిమా పోస్టర్ (ఫొటో ట్విట్టర్)

Trivikram Latest Movie: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్ - సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు కాంబినేషన్‌ మరోసారి మ్యాజిక్ చేసేందుకు రెడీ అయ్యింది. #SSMB28 వర్కింగ్ టైటిల్ తో అప్పుడే బజ్ క్రియోట్ చేసేశారు.

ప్రిన్స్ ప్రస్తుతం 'సర్కారు వారి పాట' సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత ఎస్ఎస్ రాజమౌళితో ఓ సినిమా చేయాలి. కానీ, రాజమౌళి సినిమాకంటే ముందే త్రివిక్రమ్ తో సినిమా చేసేలా ప్లాన్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. నవంబర్ లేదా డిసెంబర్ లో #SSMB28 షూటింగ్ ప్రారంభించనున్నారని సమాచారం. ఇందులో మహశ్‌కు జోడీగా పూజా హెగ్డె కనిపించనుంది. వీరి జోడి మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. 'మహర్షి' మూవీలో పూజా హెగ్డె, మహేశ్‌లు జంట సందడి చేసిన విషయం తెలిసిందే.

జీఎమ్‌ బెంటస్‌, హారిక హాసిన్‌ క్రియేషన్స్‌ కాంబోలో ఈ మూవీ రానుంది. ఈ చిత్రానికి ఎస్‌ఎస్‌ తమన్‌ సంగీతం అందించనున్నట్లు టాక్. జూనీయర్‌ ఎన్టీఆర్‌ - త్రివిక్రమ్ కాంబోలో ఓ మూవీ రానున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ముందుగా మహేశ్‌ 'SSMB28' సినిమాని పట్టాలెక్కించి, ఆ తరువాత 'NTR‌30' ప్రాజెక్ట్‌ను తీయనున్నాడని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది‌.

Venkata Chari

Venkata Chari

Next Story