SSMB28: మహేష్ ఫ్యాన్స్ కు త్రివిక్రమ్ డబుల్ ట్రీట్.. SSMB28 బ్యాక్ టు బ్యాక్ గిఫ్ట్స్..!

SSMB28: జూన్ 5 నుంచి SSMB28 కొత్త షెడ్యూల్ ప్రారంభిస్తున్నట్లు త్రివిక్రమ్ అనౌన్స్ చేశారు. అంతేకాదు, సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజును పురస్కరించుకొని SSMB28 ఫస్ట్ గింప్స్ తో పాటు టైటిల్ కూడా ప్రకటించనున్నారు.

Jyothi
Published on: 16 May 2023 3:28 PM IST
Trivikram Announced that the New Schedule of SSMB28 will Start from June 5
X

SSMB28: మహేష్ ఫ్యాన్స్ కు త్రివిక్రమ్ డబుల్ ట్రీట్..SSMB28 బ్యాక్ టు బ్యాక్ గిఫ్ట్స్

SSMB28: సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో SSMB28 సినిమా రెడీ ఔతున్న విషయం మనకు తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అతడు, ఖలేజా మంచి క్రేజ్ ను సంపాదించుకోవడంతో SSMB28 పై ఘట్టమనేని ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సినీ ఇండస్ట్రీ సైతం ఫోకస్ చేసింది. అయితే ఎవరి దిష్టి తగిలిందో ఏమో కానీ, ఈ సినిమాకి అన్నీ ఆటంకాలే ఎదురవుతున్నాయి. సినిమాని అనౌన్స్ చేసిన తర్వాత షూటింగ్ జరుపుకోవడానికి చాలా టైమ్ తీసుకుంది. షూటింగ్ ప్రారంభించుకుందిలే అనుకునే లోపు నత్తనడక చిత్రీకరణతో ఫ్యాన్స్ ను ఉసూరుమనిపించింది. ఆగస్ట్ కి రిలీజ్ చేస్తామని మూవీ టీమ్ తొలుత ప్రకటించినా.. ఆ తర్వాత సంక్రాంతికి షిఫ్ట్ చేసుకున్నారు.

ఇలా ఒకదాని తర్వాత ఒకటి అంతా ఆలస్యం కావడంతో..ఫ్యాన్స్ నిరాశతో ఉన్నారు. అయితే వారిలో నూతన ఉత్సాహం నింపేస్తూ త్రివిక్రమ్ SSMB28కి సంబంధించి రెండు బ్యాక్ టు బ్యాక్ అప్ డేట్స్ ఇచ్చారు. జూన్ 5 నుంచి SSMB28 కొత్త షెడ్యూల్ ప్రారంభిస్తున్నట్లు త్రివిక్రమ్ అనౌన్స్ చేశారు. అంతేకాదు, సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజును పురస్కరించుకొని SSMB28 ఫస్ట్ గింప్స్ తో పాటు టైటిల్ కూడా ప్రకటించనున్నారు.

SSMB28 చిత్రంలో మహేష్ కి జోడీగా పూజా హెగ్డే, శ్రీలీలా నటిస్తుండగా, థమన్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమాని 2024 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. మొత్తానికి, ఫస్ట్ లుక్ లాంఛ్ అనంతరం ఎలాంటి అప్ డేట్ లేకపోవడంతో డీలాగా ఉన్న ఘట్టమనేని ఫ్యాన్స్ కు బ్యాక్ టు బ్యాక్ అప్ డేట్స్ ఇచ్చి త్రివిక్రమ్ ఖుషీ చేసేందుకు రెడీ అవుతున్నాడు.

Jyothi

Jyothi

Next Story