Trivikram Kobali : ఏడేళ్ల క్రితం ఆగిపోయిన పవన్, త్రివిక్రమ్ కోబలి .. త్వరలో సెట్స్ పైకి?

Trivikram Kobali : అజ్ఞాతవాసి సినిమా అనంతరం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకి కాస్తా విరామం ఇచ్చిన సంగతి తెలిసిందే.. ప్రస్తుతం

Krishna
Published on: 5 Sept 2020 3:23 PM IST
Trivikram Kobali : ఏడేళ్ల క్రితం ఆగిపోయిన పవన్, త్రివిక్రమ్ కోబలి .. త్వరలో సెట్స్ పైకి?
X

Trivikram Kobali : అజ్ఞాతవాసి సినిమా అనంతరం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకి కాస్తా విరామం ఇచ్చిన సంగతి తెలిసిందే.. ప్రస్తుతం అయన వరుసపెట్టి సినిమాలను చేస్తున్నారు. అయన రీఎంట్రీ మూవీగా వకీల్ సాబ్ అనే చిత్రం తెరకెక్కుతుంది. ఇది పవన్ కళ్యాణ్ కి 26 వ చిత్రం కావడం విశేషం.. దాదాపుగా 90 శాతం షూటింగ్ పార్ట్ ని కంప్లీట్ చేశారు పవన్... ఇక క్రిష్ తో చేయబోయే ఇప్పటికే కొంత భాగం చిత్రీకరించబడింది. ఇక ఆ తర్వాత హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో సినిమాలను చేసేందుకు కమిట్ అయ్యాడు పవన్..

ఇక ఏడేళ్ళ క్రితం ఆగిపోయిన కోబలి సినిమాని తిరిగి సెట్స్ పైకి తీసుకువెళ్ళే ప్లాన్ లో ఉన్నారట పవన్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ సినిమాని చేయాలనీ అనుకున్నాడు పవన్.. రాయలసీమ నేపధ్యంలో ఈ సినిమా సాగనుంది.. అయితే ఆ సినిమా సడన్ గా ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఆగిపోయింది. అత్తారింటికి దారేది సినిమా తరవాత పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ఇదే సినిమాని చేయాలనీ అనుకున్నారు. కానీ అజ్ఞాతవాసి సినిమాతో ముందుకు వచ్చారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ పరాజయాన్ని అందుకుంది. అయితే ఇప్పుడు స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న కోబలితో ముందుకు రావాలని అనుకుంటున్నారట..

అటు త్రివిక్రమ్ ఈ ఏడాది అల్లు అర్జున్ తో అల వైకుంఠపురములో సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టి ఎన్టీఆర్ తో ఓ సినిమాని చేసేందుకు కమిట్ అయ్యాడు. ఇది ఎన్టీఆర్ కి 30వ సినిమా కావడం విశేషం.. ఈ సినిమాని హారిక అండ్ హాసిని ఎంటర్టైన్మెంట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ పై రాధాకృష్ణ - కళ్యాణ్ రామ్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి 'అయినను పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ ప్రచారంలో ఉంది.

Krishna

Krishna

Next Story