Trisha Krishnan: మరొక క్రేజీ ప్రాజెక్టు సైన్ చేసిన త్రిష

Trisha Krishnan: క్రేజీ కాంబినేషన్ తో చేతులు కలపనున్న త్రిష

Jyothi
Published on: 3 Jan 2023 11:14 AM IST
Trisha Krishnan Signed by Another Crazy Project
X

Trisha Krishnan: మరొక క్రేజీ ప్రాజెక్టు సైన్ చేసిన త్రిష 

Trisha Krishnan: కొంతకాలం పాటు తెలుగు సినిమాలకి దూరంగా ఉన్నా స్టార్ బ్యూటీ త్రిష కృష్ణన్ మళ్లీ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను బాగానే పలకరిస్తోంది. ఈ మధ్యనే ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో ప్యాన్ ఇండియా సినిమా "పొన్నియిన్ సెల్వన్ - 1" లో నటించిన త్రిష ఇప్పుడు అదే సినిమాకి రెండవ భాగమైన "పొన్నియిన్ సెల్వన్ - 2" లో కూడా నటిస్తోంది. అంతేకాకుండా "రాంగి" అనే ఒక యాక్షన్ థ్రిల్లర్ సినిమాతో కూడా బిజీగా ఉంది త్రిష.

అయితే తాజా సమాచారం ప్రకారం త్రిష ఇప్పుడు మరొక ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ ను సైన్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈసారి లోకనాయకుడు కమల్ హాసన్ సరసన త్రిష హీరోయిన్ గా కనిపించనుంది అని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే, ఈ మధ్యనే "విక్రమ్" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న కమల్ హాసన్ ఇప్పుడు మణిరత్నం దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయబోతున్నారు. 1987 లో "నాయగన్" సినిమా చేసిన ఈ క్రేజీ కాంబినేషన్ దాదాపు 35 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు రిపీట్ అవ్వనుంది. దీంతో అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా విజయ్ హీరోగా నటిస్తున్న ఒక సినిమాలో కూడా త్రిష హీరోయిన్ గా కనిపించనుంది. అంతేకాకుండా మోహన్ లాల్ హీరోగా నటిస్తున్న మలయాళం సినిమా "రామ్" లో కూడా త్రిష హీరోయిన్ గా నటించింది.

Jyothi

Jyothi

Next Story