Ponniyin Selvan: మధ్యప్రదేశ్ లోని గుడిలో ప్రత్యేక పూజలు చేస్తున్న త్రిష

త్రిష (ట్విట్టర్ ఫోటో)
Trisha: 'రోజా', 'బొంబాయి', 'గీతాంజలి' వంటి సూపర్ హిట్ సినిమాలను మనకి అందించిన దర్శకుడు మణిరత్నం తాజాగా ఇప్పుడు ...
Trisha: "రోజా", "బొంబాయి", "గీతాంజలి" వంటి సూపర్ హిట్ సినిమాలను మనకి అందించిన దర్శకుడు మణిరత్నం తాజాగా ఇప్పుడు ఒక ప్యాన్ ఇండియన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. "పొన్నియిన్ సెల్వన్" అనే టైటిల్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా లో విక్రమ్, ఐశ్వర్యారాయ్, త్రిష, కార్తి, జయం రవి, విక్రమ్ ప్రభు, జయరామ్, ఐశ్వర్య లక్ష్మి, శోభితా ధూళిపాళ, ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఇంత మంది స్టార్లు ఒకే తెరపై కనిపిస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 1955లో అదే టైటిల్ తో కల్కి కృష్ణమూర్తి రాసిన నవల ఆధారంగా ఈ సినిమా ఉండబోతోందని సమాచారం.
అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ముఖ్యపాత్ర పోషిస్తున్న త్రిష ఇప్పుడు గుడిలో పూజలు చేస్తూ కనిపించింది. వివరాల్లోకి వెళితే సినిమా షూటింగ్ ప్రస్తుతం మధ్యప్రదేశ్లోని ఓర్చాలో జరుగుతోంది. కార్తీ, ప్రకాష్ రాజ్ తదితరులు ఈ చిత్ర షెడ్యూల్ పాల్గొంటున్నారు. సినిమాకి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో షూటింగ్లో పాల్గొంటున్న త్రిష కూడా సినిమా కోసం సినిమా షూటింగ్లో భాగంగా ఒక గుడిలో ప్రత్యేక పూజలు చేయిస్తోంది.
ఈ నెలాఖరు వరకు ఈ షూటింగ్ షెడ్యూల్ కొనసాగనుంది. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమా మణిరత్నం మరియు అల్లిరాజా సుభస్కరణ్ మద్రాస్ టాకీస్ మరియు లైకా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు.
Niranjan Reddy: బీజేపీ టూరిస్ట్‌లు నెల రోజులకు ఓసారి వచ్చి వెళ్తున్నారు
29 Jun 2022 9:26 AM GMTమోడీ పర్యటనలో మెగాస్టార్‌కు ఆహ్వానం .. పవన్‌కు లభించని ఇన్విటేషన్
29 Jun 2022 7:54 AM GMTఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రతిభను కనబరచిన అల్ఫోర్స్ జూనియర్ కళాశాల విద్యార్ధులు
29 Jun 2022 7:16 AM GMTHyderabad: ప్రధాని మోడీ పర్యటనకు భారీ భద్రత
29 Jun 2022 6:52 AM GMTజమున హేచరీస్ భూముల పంపిణీ
29 Jun 2022 6:49 AM GMTకోనసీమ జిల్లాలో కలెక్టర్ సుడిగాలి పర్యటన
29 Jun 2022 6:26 AM GMTVijayasai Reddy: ఒకే ఒక్క నినాదంతో ప్లీనరీ నిర్వహిస్తున్నాం
29 Jun 2022 6:15 AM GMT
Apples: పరగడుపున యాపిల్ తింటే అద్భుతమైన ప్రయోజనాలు..!
30 Jun 2022 12:30 AM GMTBihar: అసదుద్దీన్ కు భారీ షాక్
29 Jun 2022 4:15 PM GMTసుప్రీం కోర్టులో ఉద్ధవ్‌కు షాక్.. రేపే బలపరీక్ష..
29 Jun 2022 3:58 PM GMTనా వల్ల తప్పేమైనా జరిగి ఉంటే క్షమించండి.. కేబినెట్ భేటీలో ఉద్ధవ్...
29 Jun 2022 3:47 PM GMTMen Health: పురుషులకి హెచ్చరిక.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు...
29 Jun 2022 3:30 PM GMT