Flight crash: విమాన ప్ర‌మాదాల్లో నేలరాలిన సినీ తార‌లు..

Flight crash
x

Flight crash: విమాన ప్ర‌మాదాల్లో నేలరాలిన సినీ తార‌లు..

Highlights

Flight crash: అహ్మదాబాద్‌ నుంచి లండన్‌ వెళ్తున్న ఎయిర్‌ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే కూలిపోయిన సంఘ‌ట‌న ఎంత‌టి విషాదాన్ని నింపిందో తెలిసిందే. గురువారం మ‌ధ్యాహ్నం జ‌రిగిన ఈ సంఘ‌ట‌న యావ‌త్ దేశాన్ని ఉలిక్కి ప‌డేలా చేసింది. ఈ ప్ర‌మాదంలో ఏకంగా 241 మంది మ‌ర‌ణించండి అంద‌రినీ షాక్‌కి గురి చేసింది.

Flight crash: అహ్మదాబాద్‌ నుంచి లండన్‌ వెళ్తున్న ఎయిర్‌ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే కూలిపోయిన సంఘ‌ట‌న ఎంత‌టి విషాదాన్ని నింపిందో తెలిసిందే. గురువారం మ‌ధ్యాహ్నం జ‌రిగిన ఈ సంఘ‌ట‌న యావ‌త్ దేశాన్ని ఉలిక్కి ప‌డేలా చేసింది. ఈ ప్ర‌మాదంలో ఏకంగా 241 మంది మ‌ర‌ణించండి అంద‌రినీ షాక్‌కి గురి చేసింది.

ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ కూడా మ‌ర‌ణించారు. కాగా విమాన ప్రమాదాల విషయంలో గతంలో కూడా పలు విషాద సంఘటనలు చోటు చేసుకున్నాయి. అందులో సినీ ప్రముఖులు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలూ ఉన్నాయి. అలాంటి కొన్ని సంఘ‌ట‌న‌లు ఇప్పుడు గుర్తు చేసుకుందాం.

హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన నటి సౌందర్య

తెలుగు, తమిళం, కన్నడ సినిమాలతో పాటు బాలీవుడ్‌లో కూడా మెప్పించిన నటి సౌందర్య, 2004 ఏప్రిల్ 17న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. కరీంనగర్‌లో బీజేపీ తరపున ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోయింది. అప్పటికి ఆమె వయసు కేవలం 31 సంవత్సరాలు మాత్రమే. ఈ సంఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

బాంబు పేలుడు కారణంగా మరణించిన నటుడు ఇంద్ర ఠాకూర్

1985 జూన్ 23న ఎయిర్ ఇండియా కనిష్కా-182 విమానం కెనడా సమీపంలో కూలిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న బాలీవుడ్ నటుడు ఇంద్ర ఠాకూర్‌ తన కుటుంబంతో సహా ప్రాణాలు కోల్పోయారు. ఈ విమానం ఉగ్రవాదులు బాంబు పేల్చడంతో ఆ ఘటన జరిగింది. అప్పటికి ఆయన వయసు 35 సంవత్సరాలు మాత్రమే.

చిన్నవయసులోనే తల్లితో కలసి చనిపోయిన తరుణి సచ్‌దేవ్‌

'పా' సినిమాలో అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటించిన బాల నటి తరుణి సచ్‌దేవ్ నేపాల్‌లో జరిగిన విమాన ప్రమాదంలో మృతి చెందింది. ఆమె తల్లి కూడా అదే ప్రమాదంలో మరణించారు. ఈ ఘటన 2012 మే నెలలో జరిగింది. అప్ప‌టికి ఆమె వ‌య‌సు 14 ఏళ్లు మాత్ర‌మే.

కుటుంబంతో స‌హా ప్రాణాలు వ‌దిలిన మలయాళ నటి రాణి చంద్ర

1976లో ముంబయి సమీపంలో జరిగిన ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమాన ప్రమాదంలో మలయాళ నటి రాణి చంద్ర తన తల్లి, ముగ్గురు సోదరీమణులు మృతి చెందారు. ఆ స‌మ‌యానికి ఆమె మలయాళ సినీ పరిశ్రమలో టాప్ నటి.

అమెరికన్ గాయని, నటి అలియాహ్

2001 ఆగస్టు 25న బహామాస్‌లోని అబాకో ద్వీపంలో టేకాఫ్ అయిన వెంటనే ఓ చిన్న విమానం కూలిపోయింది. ఆ విమానంలో అమెరికన్ సింగర్, యాక్ట్రెస్ అయిన అలియాహ్ ఉన్నారు. అప్పటికి ఆమె వయసు కేవలం 22 సంవత్సరాలు. ఈ ప్రమాదానికి కారణం విమానంలో ఎక్కువ బరువు అని అధికారులు గుర్తించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories