"ఆర్ఆర్ఆర్" ఈవెంట్ కి రానున్న హాలీవుడ్ స్టార్

Tom Cruise As Chief Guest For RRR Event In Dubai
x

"ఆర్ఆర్ఆర్" ఈవెంట్ కి రానున్న హాలీవుడ్ స్టార్ 

Highlights

RRR: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియన్ మల్టీస్టారర్ సినిమా "ఆర్ఆర్ఆర్".

RRR: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియన్ మల్టీస్టారర్ సినిమా "ఆర్ఆర్ఆర్". ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 7న విడుదల కావాల్సింది కానీ ఇప్పుడు ఈ చిత్రాన్ని మార్చ్ 25 కి వాయిదా వేశారు దర్శకనిర్మాతలు. ప్రస్తుతం నిర్మాణానంతర పనులతో బిజీగా ఉన్న మూవీ యూనిట్ త్వరలోనే ప్రమోషన్స్ ని మొదలు పెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలోనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని భారీస్థాయిలో ప్లాన్ చేస్తున్నారట.

తాజాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. "ఆర్ఆర్ఆర్" ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇక్కడ కాదు దుబాయ్ లో జరగబోతోంది. ఈ ఈవెంట్ కి ప్రముఖ హాలీవుడ్ యాక్టర్ టామ్ క్రూజ్ ముఖ్యఅతిథిగా విచ్చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో ఒలీవియా మోరిస్, రే స్టీవెన్సన్ వంటి హాలీవుడ్ నటులు కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి టామ్ క్రూజ్ ను పిలిచి సినిమాకి మరింత హైప్ ను పెంచబోతున్నరు దర్శక నిర్మాతలు.

Show Full Article
Print Article
Next Story
More Stories