రాములో రాములా.. అంటూ సుమ నెట్టింట్లో హల్ చల్ !

ఈ ఏడాది ఆరంభంలో స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ , త్రివిక్రమ్‌ కాంబినేషన్ లో వచ్చిన 'అల.. వైకుంఠపురములో' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..

S. Srikanth
Updated on: 7 Jun 2020 10:13 PM IST
రాములో రాములా.. అంటూ సుమ నెట్టింట్లో హల్ చల్ !
X
Suma (File Photo)

ఈ ఏడాది ఆరంభంలో స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ , త్రివిక్రమ్‌ కాంబినేషన్ లో వచ్చిన 'అల.. వైకుంఠపురములో' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఇక ఈ సినిమాకి తమన్ అందించిన సంగీతం పెద్ద హైలెట్ గా నిలిచింది. అందులో ముఖ్యంగా 'బుట్టబొమ్మ' సాంగ్‌ బాగా క్రేజ్‌ ను సంపాదించుకుంది. ఈ పాటకు బన్ని, పూజా హెగ్డె వేసిన స్టెప్పులు అందరినీ ఆకట్టుకున్నాయి.

తెలుగు టీవీ పరిశ్రమలో తనకంటూ మంచి గుర్తింపు, ఫ్యాన్ ఫాల్లోవింగ్ సంపాదించుకున్న యాంకర్ సుమ. తాజాగా అల్లు అర్జున్ నటించిన 'అల.. వైకుంఠపురంలో' చిత్రం నుండి 'రాములో రాముల' పాటకి డాన్స్ వేశారు. ఈ పాటకు సంబంధించిన వీడియోను తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్‌ చేయడంతో తెగ వైరల్‌ అయింది. అలాగే ఇంతకూ ముందు మరో వ్యాఖ్యాత అనసూయ సైతం తన ఫొటోలను అభిమానులతో పంచుకున్న విషయం తెలిసిందే..

అల.. వైకుంఠపురములో సినిమా తరవాత అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమా చేస్తున్నాడు. ఇది అల్లు అర్జున్ కి 20వ చిత్రం కాగా, సుకుమార్ తో మూడవ చిత్రం.. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. దేవి శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది.


View this post on Instagram

#Longtimenoworkeffects , zorro is mad at me

A post shared by Suma Kanakala (@kanakalasuma) on


S. Srikanth

S. Srikanth

Next Story