Director Teja Tests Corona Positive : దర్శకుడు తేజకు కరోనా పాజిటివ్‌!

Director Teja Tests Corona Positive : కరోనా ఎవరిని వదలడం లేదు.. సామన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరి పైన తన ప్రభావం చూపిస్తోంది.

Krishna
Published on: 3 Aug 2020 5:51 PM IST
Director Teja Tests Corona Positive : దర్శకుడు తేజకు కరోనా పాజిటివ్‌!
X
teja (File Photo)

Director Teja Tests Corona Positive : కరోనా ఎవరిని వదలడం లేదు.. సామన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరి పైన తన ప్రభావం చూపిస్తోంది. ఇక అందులోనూ సినిమా వాళ్ళ పైన కరోనా ప్రభావం ఎక్కువ ఉందని చెప్పాలి. ఇప్పటికే టాలీవుడ్ లో చాలా మంది ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. తాజాగా డైరెక్టర్ తేజ కూడా కరోనా బారిన పడ్డారు. ఇటీవల ముంబయి వెళ్లి వచ్చిన ఆయన ఆ తర్వాత పరీక్షలు నిర్వహించుకోగా కరోనా సోకినట్లు వెల్లడైంది. కాకపోతే ఆయన కుటుంబ సభ్యులకు మాత్రం నెగెటివ్‌ వచ్చినట్లుగా సమాచారం.. ఇక ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారు తేజ..

గోపీచంద్‌, రానాలతో ఆయన చెరో సినిమా సినిమా చేయనున్నట్లుగా ప్రకటించారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో షూటింగ్‌లు చేసే పరిస్థితి లేకపోవడంతో అయన ప్రస్తుతం వెబ్‌ సిరీస్‌లపై దృష్టి పెట్టారు. అయితే నిజానికి కరోనా వైరస్ బారిన పడకుండా ఉండటానికి తేజ ఇటీవల ప్రజలకు జాగ్రత్తలు చెబుతూ ఒక వీడియోను విడుదల చేశారు. ఇప్పుడు ఆయనే కరోనా బారినా పడడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కాగా అటు టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళికి కూడా కరోనా సోకిన సంగతి తెలిసిందే..

Krishna

Krishna

Next Story