November Story Web Series: మరో కొత్త వెబ్ సిరీస్‌లో తమన్నా

Tamannaah Web Series November Story to Stream From 20th May on Hotstar
x

తామన్నా నవంబర్ స్టోరీ పోస్టర్ 

Highlights

November Story Web Series: తమన్న నటిస్తోన్న వెబ్ సిరీస్ 'నవంబర్ స్టోరీ' ఈ నెల 20 నుంచి డిస్ని ప్లస్ హాట్ స్టార్ వీఐపీలో ప్రసారం కానుంది.

November Story Web Series: ఈ రోజుల్లో స్టార్ హోదాతో సంబంధం లేకుండా చాలా మంది డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లోకిఅడుగుపెడుతున్నారు. కొందరు గ్లామర్ ప్రజెంటేషన్ తో అదరగొడుతుంటే మరికొందరి వారి అసలైన యాక్టింగ్ స్కిల్స్ ని చూపిస్తున్నారు. ఈ తాజా తమన్నా నటించిన మరో బ్ సీరీస్ పేరు 'నవంబర్ స్టోరీ'. తమిళ దర్శకుడు ఇంద్ర సుబ్రమణియన్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సీరీస్ ఈ నెల 20 నుంచి డిస్ని ప్లస్ హాట్ స్టార్ వీఐపీలో ప్రసారం కానుంది. ఈ వెబ్ సిరీస్ తెలుగు, తమిళ భాషాలతో పాటు హిందీలో కూడా స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్‌లో తమన్నా అనురాధ అనే అమ్మాయి పాత్రలో నటించిందట. ఈ పాత్ర తనకెంతో సంతృప్తిని ఇచ్చిందని ఈ సందర్భంగా పేర్కోంది తమన్నా.

ఇక ఆమె నటించిన మరో వెబ్ సిరీస్‌ 'లెవన్త్‌ అవర్‌'. ఈ వెబ్ సిరీస్ ఇటీవల ఆహాలో ప్రసారం అయ్యి పరవాలేదనిపించింది. ఈ వెబ్ సిరీస్‌కు ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం వహించారు. ప్రవీణ్ సత్తారు గతంలో రాజశేఖర్ హీరోగా వచ్చిన గరుడ వేగ అనే సైంటిఫిక్ థ్రిల్లర్‌ను తెరకెక్కంచి మంచి విజయాన్ని అందుకున్నారు. ఆయన ప్రస్తుతం నాగార్జున హీరోగా కాజల్ హీరోయిన్‌గా ఓ థ్రిల్లర్‌ను తెరకెక్కిస్తున్నారు.

ఇక తమన్నా నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. తమన్నా ప్రస్తుతం గోపీచంద్ హీరోగా వస్తోన్న సీటీమార్‌ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే కరోనా కారణంగా ఈ సినిమా విడుదలను వాయిదా వేసింది చిత్రబృందం. ఈ సినిమా కబడ్డీ ఆట నేపథ్యంలో తెరకెక్కుతోంది. గోపీచంద్ ఏపీకి కోచ్‌గా ఉంటే.. తమన్నా తెలంగాణ కోచ్‌గా కనిపించనుందట. ఈ సినిమాలో తమన్న సొంతంగా డబ్బింగ్ చెప్పిందట.


Show Full Article
Print Article
Next Story
More Stories